Site icon HashtagU Telugu

Dasun Shanaka: గుజరాత్ టైటాన్స్‌లోకి మరో ఆల్‌రౌండర్.. కేన్‌ విలియమ్సన్‌ స్థానంలో శ్రీలంక కెప్టెన్‌..!

111

Resizeimagesize (1280 X 720) 11zon

న్యూజిలాండ్‌ ఆటగాడు కేన్‌ విలియమ్సన్‌ స్థానంలో శ్రీలంక కెప్టెన్‌ దాసున్ షనక (Dasun Shanaka)ను గుజరాత్‌ టైటాన్స్‌ జట్టులోకి తీసుకుంది. ఐపీఎల్ 16వ సీజన్ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న విలియమ్సన్ గాయపడ్డాడు. షనకకు తొలిసారి ఐపీఎల్‌లో చోటు దొరికింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో గుజరాత్ రెండో మ్యాచ్ తర్వాత షనక జట్టులో చేరనున్నాడు. షనక 181 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో అతను 141.94 స్ట్రైక్ రేట్‌తో 3702 పరుగులు చేశాడు. అతను 8.8 ఎకానమీ రేటుతో 59 వికెట్లు కూడా తీశాడు. ఈ ఏడాది భారత్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో షనక 187.87 స్ట్రైక్ రేట్‌తో 124 పరుగులు చేశాడు. అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్నాడు. షనక అనుభవంతో గుజరాత్ లాభపడుతుంది.

రెండు రోజుల క్రితం విలియమ్సన్ కు గాయం

చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన సీజన్‌లోని మొదటి మ్యాచ్‌లో గాయం కారణంగా కేన్ విలియమ్సన్ టాటా IPL 2023 నుండి తొలగించబడ్డాడని ప్రకటించడానికి మేము చింతిస్తున్నాము. మా టైటాన్ త్వరగా కోలుకోవాలని మేము కోరుకుంటున్నాము. అతను త్వరలో మైదానంలోకి వస్తాడని ఆశిస్తున్నామని ఆదివారం (ఏప్రిల్ 2) ఉదయం గుజరాత్ అధికారిక ప్రకటన చేసింది.

Also Read: Rajasthan Vs Punjab: నేడు రాజస్థాన్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్.. రెండో విజయం కోసం ఇరు జట్లు ఫైట్..!

సిక్స్ ఆపే ప్రయత్నంలో విలియమ్సన్ గాయపడ్డాడు

చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో 32 ఏళ్ల విలియమ్సన్ 13వ ఓవర్‌లో బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. 13వ ఓవర్లో జాషువా లిటిల్ వేసిన బంతిని చెన్నై ఓపెనర్ రితురాజ్ గైక్వాడ్ భారీ షాట్ కొట్టాడు. బంతి సిక్స్ అయ్యేలా కనిపించింది. అయితే బౌండరీ లైన్‌పై నిలబడిన కేన్ విలియమ్సన్ బంతిని జంప్ చేస్తూ క్యాచ్ పట్టాడు. బౌండరీ లైన్ బయట పడబోతుండగానే బంతిని లోపలికి విసిరాడు. విలియమ్సన్ సిక్స్ పోకుండా ఆపాడు. కానీ అతని మోకాలికి గాయమైంది. ఆ తర్వాత విలియమ్సన్ నొప్పితో మైదానం వీడాల్సి వచ్చింది.

ఐపీఎల్‌లో మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.గుజరాత్ బ్యాటర్లు సాయి సుదర్శన్‌ (62*) అర్ధశతకంతో మెరవగా, డేవిడ్‌ మిల్లర్‌ (31*), విజయ్‌శంకర్‌ (29) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో నోర్జే 2 వికెట్లు, ఖలీల్ అహ్మద్, మార్ష్ చెరో వికెట్ తీశారు.