Gujarat Titans: ప్లే ఆఫ్ బెర్తుకు అడుగు దూరంలో గుజరాత్

ఐపీఎల్‌-2022లో ఇవాళ గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి.

  • Written By:
  • Publish Date - May 6, 2022 / 12:03 PM IST

ఐపీఎల్‌-2022లో ఇవాళ గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి.
ముంబైలోని బ్రబోర్న్ క్రికెట్‌ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు అద్భుతం‍గా రాణిస్తుండగా.. ముంబై ఇండియన్స్‌ ఆడిన 9 మ్యాచుల్లో కేవలం ఒకే ఒక్క విజయం సాధించి పాయింట్ల పట్టికలో అఖరి స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో రాజస్తాన్‌ రాయల్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో గెలిచి సీజన్‌ లో రెండో విజయాన్ని అందుకోవాలని భావిస్తోంది. పస్తుత సీజన్‌లో ముంబై ఇండియన్స్‌.. బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండు విభాగాల్లోనూ ఘోరంగా విఫలమైంది. ముఖ్యంగా ఓపెనర్లు రోహిత్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌ ఫామ్‌లో లేకపోవడం ఆ జట్టును కలవరపెడుతోంది. ఈ మ్యాచ్‌లో పలు మార్పులతో ముంబై బరిలోకి దిగే అవకాశం ఉంది.

ఇక గుజరాత్ టైటాన్స్ విషయానికి వస్తే.. ఈ ఏడాది సీజన్‌లో వరుస విజయాలతో దుమ్ము రేపుతోంది. ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ .. 8 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో నిలిచింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ పరంగా హార్దిక్ పాండ్య సేన పటిష్టంగా ఉంది. గత మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పై ఓటమితో ఆ జట్టు వరుస విజయాలకు బ్రేక్ పడింది. దీంతో ముంబై పై గెలిచి ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు చేసుకోవాలని గుజరాత్ భావిస్తోంది.

గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్‌లో కెప్టెన్‌ హార్దిక్ పాండ్యా, శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా ఫామ్ లో ఉండడం ముంబై బౌలర్లకు సవాలే. ఇక బౌలిం‍గ్‌ పరంగా గుజరాత్ జట్టు పటిష్టంగా కన్పిస్తోంది. బౌలిం‍గ్‌ విభాగంలో లాకీ ఫెర్గూసన్, మహమ్మద్ షమీ, రషీద్ ఖాన్ వంటి స్టార్‌ బౌలర్లు ఉన్నారు. ఇక ఈ మ్యాచ్ జరగనున్న బ్రబౌర్న్ స్టేడియం పిచ్‌ గత మ్యాచ్‌ల్లో బ్యాటింగ్‌కు, బౌలర్లకు అనుకూలించింది. గత మ్యాచ్‌ల్లో భారీ స్కోర్‌లు నమోదయ్యాయి. అయితే కొత్త బంతితో బౌలర్లు కూడా వికెట్లు పడగొట్టారు. టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.