Victory Parade: గుజరాత్‌ టీమ్‌ను సన్మానించిన సీఎం భూపేంద్రపటేల్

ఐపీఎల్ 15వ సీజన్‌లో కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ ఛాంపియన్‌గా నిలుస్తుందని ఎవ్వరూ ఊహించలేదు.

  • Written By:
  • Publish Date - May 30, 2022 / 11:32 PM IST

ఐపీఎల్ 15వ సీజన్‌లో కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ ఛాంపియన్‌గా నిలుస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా తన తొలి సీజన్‌లోనే అదరగొట్టింది.

లీగ్ ఆరంభం నుంచీ టాప్ టీమ్స్‌ను ఓడిస్తూ ఫైనల్‌కు దూసుకొచ్చిన గుజరాత్ టైటిల్ పోరులోనూ దుమ్మురేపింది. హార్థిక్ పాండ్యా కెప్టెన్సీ, మిల్లర్, సాహా , గిల్ , షమీ, రషీద్ ఖాన్, యశ్ దయాల్ వంటి ఆటగాళ్ళు నిలకడగా రాణించి గుజరాత్‌ను విజేతగా నిలిపారు. దీంతో గుజరాత్ టైటాన్స్ విజయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. తాజాగా గుజరాత్ టైటాన్స్ టీమ్ అహ్మదాబాద్‌లో అడుగుపెట్టగా ఘనస్వాగతం లభించింది. టీమ్ సభ్యులంతా ట్రోఫీతో ఓపెన్‌ టాప్‌ బస్సులో ఊరేగింపు నిర్వహించారు.

కొన్ని వేల మంది అభిమానులు వీధుల్లోకి వచ్చి గుజరాత్ టీమ్‌ను చీర్‌ చేశారు. ఉస్మాన్‌పురా రివర్‌ఫ్రంట్‌ దగ్గర ప్రారంభమై విశ్వకుంజ్‌ రివర్‌ఫ్రంట్‌ దగ్గర ఈ బస్‌ పరేడ్‌ ముగిసింది. యర్స్‌ బస్సుపై ఊరేగుతుండగా.. ఫ్లైఓవర్లపై నుంచి కొందరు అభిమానులు పూల వర్షం కురిపించారు. తమ ఓపెన్‌ టాప్‌ బస్‌ పరేడ్‌ వీడియోను శుభ్‌మన్‌ గిల్‌ షేర్‌ చేసుకున్నాడు. ఫ్యాన్స్‌ రెస్పాన్స్‌ చూసి ప్లేయర్సంతా చాలా ఉత్సాహంగా కనిపించారు. అనంతరం గుజరాత్ సీఎం భూపేంద్రభాయ్ పటేల్‌ను టైటాన్స్ టీమ్ మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా కోచ్‌ ఆశిష్‌ నెహ్రా, కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా, ఇతర టీమ్‌ సభ్యులందరినీ గుజరాత్‌ సీఎం భూపేంద్రభాయ్‌ పటేల్‌ సన్మానించారు. ఊరేగింపు సందర్భంగా గుజరాతీ సాంప్రదాయ మేళతాళాలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి.