IPL Auction 2022 : గుజరాత్ టైటాన్స్ పూర్తి జట్టు ఇదే

ఐపీఎల్ 2022 సీజన్ కోసం గుజరాత్ టైటాన్స్ ఫ్రాంఛైజీ వ్యూహాత్మకంగా జట్టుని ఎంపిక చేసుకుంది. మెగా వేలానికి రూ.48 కోట్లతో వెళ్లిన చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ.. 23 మందిని కొనుగోలు చేసింది. ఇందులో 8 మంది విదేశీ క్రికెటర్లు కూడా ఉన్నారు.

  • Written By:
  • Publish Date - February 14, 2022 / 04:47 PM IST

ఐపీఎల్ 2022 సీజన్ కోసం గుజరాత్ టైటాన్స్ ఫ్రాంఛైజీ వ్యూహాత్మకంగా జట్టుని ఎంపిక చేసుకుంది. మెగా వేలానికి రూ.48 కోట్లతో వెళ్లిన చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ.. 23 మందిని కొనుగోలు చేసింది. ఇందులో 8 మంది విదేశీ క్రికెటర్లు కూడా ఉన్నారు. అయితే తొలి సీజన్ లోనే గుజరాత్ టైటాన్స్ స్టార్ ఆటగాళ్లతో పటిష్టమైన జట్టును సిద్ధం చేసింది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని ఈ జట్టు తొలి సీజన్‌లోనే ట్రోఫీ సాధించినా ఎవరూ ఆశ్చర్యపోనక్కర్లేదు. రషీద్ ఖాన్, శుభ్‌మాన్ గిల్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా వంటి డ్రాఫ్ట్ ఆటగాళ్లు కూడా భారీ మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. వీరే కాకుండా అద్భుతమైన ఆల్ రౌండర్లు, ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లు, పవర్ హిట్టర్లతో కూడిన జట్టు కొనుగోలు చేసింది.

ఈ మెగా వేలంలో లాకీ ఫెర్గూసన్ ను రూ. 10 కోట్లు, రాహుల్ తెవాతియాను రూ. 9 కోట్లు, మహమ్మద్ షమీని రూ. 6.25 కోట్లు, యాష్‌ దయాల్‌ ను రూ. 3.20 కోట్లు, ఆర్‌ సాయికిషోర్ ను రూ. 3 కోట్లు, డేవిడ్ మిల్లర్‌ను రూ. 3 కోట్లు, అభినవ్‌ సదరంగనిని రూ. 2.60 కోట్లు, అల్జారీ జోసెఫ్‌ ను రూ. 2.40 కోట్లు, మ్యాథ్యూ వేడ్ను రూ. 2.40 కోట్లు, జాసన్‌ రాయ్‌ ను రూ. 2 కోట్లు వెచ్చించి గుజరాత్ టైటాన్స్ వేలంలో సొంతం చేసుకుంది… అలాగే వృద్ధిమాన్‌ సాహాను రూ. 1.90 కోట్లు, జయంత్ యాదవ్‌ను రూ. 1.70 కోట్లు, విజయ్‌ శంకర్‌ను రూ. 1.40 కోట్లు, డొమినిక్‌ డ్రాక్స్‌ ను రూ. 1.10 కోట్లు, వరుణ్‌ ఆరోన్‌ ను రూ. 50 లక్షలు, గుర్‌కీరత్‌ సింగ్‌ను రూ. 50 లక్షలు, నూర్ అహ్మద్‌ను రూ. 30 లక్షలు, సాయి సుదర్శన్, దర్శన్ నల్కాండే, ప్రదీప్‌ సంగ్వాన్‌ ను తలో రూ. 20 లక్షలు చెల్లించి మెగా వేలంలో గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ కైవసం చేసుకుంది. వేలంలో స్ట్రాటజీ బాగానే అమలు చేసిన గుజరాత్ మైదానంలో ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందో వేచి చూడాలి.