Gujarat Titans In Playoffs: టైటాన్స్ థ్రిల్లింగ్ విక్టరీ

లో టార్గెట్ ఛేజింగ్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ థ్రిల్లింగ్ విక్టరీని సొంతం చేసుకుంది. గుజరాత్‌ను 144 పరుగులకే కట్టడి చేసిన లక్నో..

Published By: HashtagU Telugu Desk
gujarat titans

gujarat titans

లో టార్గెట్ ఛేజింగ్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ థ్రిల్లింగ్ విక్టరీని సొంతం చేసుకుంది. గుజరాత్‌ను 144 పరుగులకే కట్టడి చేసిన లక్నో.. ఛేజింగ్‌లో వరుస వికెట్లను చేజార్చుకుని కేవలం 82 పరుగులకే ఆలౌట్ అయింది. దాంతో గుజరాత్ 62 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుని పాయింట్ల పట్టికలో అగ్ర స్థానానికి చేరింది. ఈ ఆసక్తికర మ్యాచ్‌కు పుణె ఎంసీఏ స్టేడియం వేదికైంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్ జట్టు 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ఓపెనర్ శుభమన్ గిల్ హాఫ్ సెంచరీతో రాణించాడు. 49 బంతులు ఎదుర్కొన్న ఏడు ఫోర్లతో 63 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. సాహా 5 (11), మ్యాథ్యూ వేడ్ 10 (7), కెప్టెన్ హార్ధిక్ పాండ్యా 11 (13), మిల్లర్ 26 (24) పరుగులతో అవుటవ్వగా.. రాహుల్ తెవాతియా 16 బంతుల్లో నాలుగు ఫోర్లతో 22 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. లక్నో బౌలర్లలో ఆవేశ్ ఖాన్ రెండు, మోషిన్ ఖాన్, హోల్డర్ చెరో వికెట్ తీసుకున్నారు.

  Last Updated: 10 May 2022, 11:41 PM IST