Gujarat Titans vs Chennai Super Kings: గుజరాత్ ఘనంగా… ఆరంభ మ్యాచ్‌లో చెన్నైకి నిరాశే

ఐపీఎల్ 16వ సీజన్‌ను డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ గ్రాండ్ విక్టరీతో ఆరంభించింది.

Published By: HashtagU Telugu Desk
Gujarat Titans

Gt Ipl

Gujarat Titans Win IPL Opener : ఐపీఎల్ 16వ సీజన్‌ను డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) గ్రాండ్ విక్టరీతో ఆరంభించింది. చెన్నై సూపర్‌కింగ్స్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకి శుభారంభం లభించలేదు. మూడో ఓవర్లోనే ఓపెన్ డేవాన్ కాన్వే‌ను షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. తర్వాత మొయిన్ అలీతో కలిసి మరో ఓపెనర్ రుతురాజ్ ధాటిగా ఆజాజు. ఇద్దరూ బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. మొయిన్ అలీ, స్టోక్స్ వెంటవెంటనే ఔటైనప్పటకీ.. రుతురాజ్ జోరు మాత్రం తగ్గలదు. భారీ సిక్సర్లతో అదరగొట్టాడు. 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే చివర్లో ధాటిగా ఆడే ప్రయత్నంలో రషీద్ ఖాన్ బౌలింగ్‌లో శుబ్‌మన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. గిల్ 50 బంతుల్లో 92 పరుగులు చేశాడు. ఇందులో 4 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. అయితే రుతురాజ్ మినహా మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. అంబటి రాయుడు 12, శివమ్ దుబే19, రవీంద్ర జడేజా 1 తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. చివర్లో ధోనీ కాసేపు మెరుపులు మెరిపించడంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి చెన్నై 178 పరుగులు చేయగలిగింది. ఒక దశలో 200 వరకూ స్కోర్ చేస్తుందనుకున్న చెన్నైని గుజరాత్ బౌలర్లు కట్టడి చేశారు. గుజరాత్ బౌలర్లలో మహమ్మద్ షమీ. అల్జారీ జోసెఫ్, రషీద్ ఖాన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.

ఛేజింగ్‌లో గుజరాత్ టైటాన్స్‌కు మెరుపు ఆరంభమే లభించింది. తొలి వికెట్‌కు ఓపెనర్లు 37 పరుగులు జోడించారు. సాహా 25 రన్స్‌కు ఔటైనా.. గిల్ మెరుపు ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. అటు సాయిసుదర్శన్ కూడా ధాటిగా ఆడి 22 పరుగులు చేసాడు. గిల్ కేవలం 36 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 63 పరుగులు చేశాడు. చివర్లో గిల్ , హార్థిక్ పాండ్యా వరుసగా ఔటైనప్పటకీ.. విజయ్ శంకర్ 27 పరుగులతో రాణించాడు. అయితే చెన్నై బౌలర్లు కాస్త కట్టడి చేసేందుకు ప్రయత్నించడంతో మ్యాచ్ ఆసక్తికరంగా కనిపించింది. ఈ దశలో రషీద్ ఖాన్ మెరుపు బ్యాటింగ్‌తో చెన్నైకి షాకిచ్చాడు. దీంతో గుజరాత్ 19.2 ఓవర్లలో టార్గెట్‌ను అందుకుంది. తద్వారా ఐపీఎల్ చరిత్రలో చెన్నైపై తన సక్సెస్‌ఫుల్ రికార్డును నిలుపుకుంది.

Also Read:  IPL 2023 Opening Ceremony LIVE: ఐపీఎల్ కు గ్లామర్ షో.. రష్మిక, తమన్నా లైవ్ డాన్స్

  Last Updated: 01 Apr 2023, 12:15 AM IST