Pitch Report: GT vs SRH: పిచ్ రిపోర్ట్

గుజరాత్ టైటాన్స్ ,సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య నేడు కీలక మ్యాచ్ జరగనుంది. ఇరు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత ప్రతిష్టాత్మకం.

Pitch Report: గుజరాత్ టైటాన్స్ ,సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య నేడు కీలక మ్యాచ్ జరగనుంది. ఇరు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత ప్రతిష్టాత్మకం. నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ లావెండర్ జెర్సీని ధరించనుంది. క్యాన్సర్‌పై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ జెర్సీ ముఖ్య ఉద్దేశం.

నేడు జరగనున్న ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ గెలిస్తే ప్లేఆఫ్ కైవసం చేసుకుంటుంది. ఇక సన్‌రైజర్స్ ఓడితే ప్లేఆఫ్ ఆశలను వదులుకోవాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మ్యాచ్‌కు ముందు అహ్మదాబాద్‌లో జరగనున్న గుజరాత్ వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ పిచ్, వాతావరణం ఎలా ఉండబోతుందో చూద్దాం.

గత సీజన్లో ఛాంపియన్‌గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ IPL 2023లో ప్లేఆఫ్‌లకు చేరుకోవడానికి కేవలం 1 అడుగు దూరంలో ఉంది. ఈ సీజన్‌లో గుజరాత్‌ ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడగా 8 మ్యాచ్‌లు గెలిచి 4 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ 16 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ 11 మ్యాచ్‌లు ఆడి 4 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది.

పిచ్ విషయానికి వస్తే.. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం పిచ్‌పై బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం ఎక్కువగా ఉండనుంది. గత రికార్డులను బట్టి చూస్తే నరేంద్ర మోడీ స్టేడియం బ్యాటింగ్ కి అనుకూలంగా మారుతుంది. అదేవిధంగా ఫాస్ట్ బౌలర్లకు ఈ పిచ్ కలిసొస్తుంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఈ మైదానంలో 6 మ్యాచ్‌లు జరగ్గా, 12 ఇన్నింగ్స్‌ల్లో 6 ఇన్నింగ్స్‌లు 200 మార్క్‌ను దాటాయి. ఈ మైదానంలో సగటు తొలి ఇన్నింగ్స్ స్కోరు 165 పరుగులు. వెదర్ విషయానికి వస్తే.. ఈ రోజు అహ్మదాబాద్‌లో వేడి తీవ్రత అధికంగా ఉండనుంది. ఉష్ణోగ్రత 33 నుండి 41 డిగ్రీల సెల్సియస్‌గా ఉండవచ్చని వెదర్ రిపోర్ట్ అంచనా వేస్తుంది.

Read More: Cyclone Mocha : 6 మంది మృతి..700 మందికి గాయాలు