Site icon HashtagU Telugu

GT vs RCB: ఆర్సీబీ వ‌ర్సెస్ గుజ‌రాత్‌.. గిల్ జ‌ట్టుకు డూ ఆర్ డై మ్యాచ్‌..!

GT vs RCB

Safeimagekit Resized Img (1) 11zon

GT vs RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా 45వ మ్యాచ్‌ గుజరాత్ టైటాన్స్ వ‌ర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (GT vs RCB) జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గ‌నుంది. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ప్రదర్శనలో మెరుగవ్వాల్సి ఉంది. ఈ సీజన్‌లో గుజరాత్ జట్టు ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్‌లు ఆడగా నాలుగింటిలో మాత్రమే విజయం సాధించింది. ఐదింటిలో ఓటమిని చవిచూసింది. ప్రస్తుతం ఆ జట్టు ఎనిమిది పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది.

2022 ఛాంపియన్ గుజరాత్.. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జ‌ట్ల‌ కంటే పాయింట్ల ప‌ట్టిక‌లో ముందుకు వెళ్లాలంటే ఆర్సీబీతో మ్యాచ్ గెలవాలి. IPL 2024లో 44 మ్యాచ్‌ల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ఆరో స్థానంలో, గుజరాత్ టైటాన్స్ ఏడవ స్థానంలో, పంజాబ్ కింగ్స్ ఎనిమిదో స్థానంలో, ముంబై ఇండియన్స్ తొమ్మిదో స్థానంలో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 10వ స్థానంలో ఉన్నాయి.

Also Read: India squad: టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌.. టీమిండియా జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌కు మూహ‌ర్తం ఫిక్స్‌..!

నరేంద్ర మోదీ స్టేడియం పిచ్ రిపోర్టు

IPL 2024 సీజన్ ఇప్పుడు ట్రేడింగ్ సీజన్‌గా మారింది. ఈ సీజన్‌లో పరుగుల పరంగా ఎన్నో రికార్డులు బద్దలవుతున్నాయి. లీగ్ 17వ సీజన్‌లో దాదాపు ప్రతి మ్యాచ్‌లో 200 స్కోర్లు చేస్తున్నారు. కానీ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పరిస్థితి అలా లేదు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 200 స్కోరు ఒక్కసారి మాత్రమే నమోదైంది. ఈ మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో గుజరాత్ జట్టు 89 పరుగులకే ఆలౌట్ అయింది. స్పిన్నర్లకు ఈ పిచ్ బాగా సాయ‌ప‌డుతుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలోని పిచ్ ఎరుపు, నలుపు నేలలతో తయారు చేయబడింది. అందువల్ల ఇక్కడ బ్యాట్, బాల్ మధ్య చాలా ఆసక్తికరమైన పోటీ కనిపిస్తుంది.

We’re now on WhatsApp : Click to Join

అహ్మదాబాద్ వెద‌ర్ రిపోర్టు

గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగే రోజు ఆదివారం ఇక్కడ చాలా వేడిగా ఉంటుందని భావిస్తున్నారు. రోజు గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల వరకు వెళ్లవచ్చు. కనిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల వరకు ఉండవచ్చు. పగటిపూట మ్యాచ్ జరగడం వల్ల ఇక్కడ మంచు పెద్ద‌గా ఉండే అవ‌కాశం లేదు.

ఇరుజ‌ట్ల అంచనా

గుజరాత్ టైటాన్స్‌: వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభమాన్ గిల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, సాయి కిషోర్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, సందీప్ వారియర్.

రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు: విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విల్ జాక్వెస్, రజత్ పాటిదార్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, లాకీ ఫెర్గూసన్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్.

Exit mobile version