Site icon HashtagU Telugu

GT vs MI: మ‌రికాసేప‌ట్లో ముంబై, గుజ‌రాత్ జ‌ట్ల మ‌ధ్య కీల‌క పోరు.. ఈ ఇద్ద‌రూ ఆట‌గాళ్ల‌పైనే క‌న్ను!

Gujarat Titans

Gujarat Titans

GT vs MI: ఐపీఎల్ 2025 ఎలిమినేటర్ మ్యాచ్ ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ (GT vs MI) మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు గుజరాత్ ఇద్దరు బ్యాట్స్‌మెన్ ముంబైను టెన్ష‌న్ పెడుతున్నారు. అందులో ఒక బ్యాట్స్‌మెన్ గురించి ముంబై శిబిరం మొత్తం ఆందోళన చెందుతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్‌లో ఈ బ్యాట్స్‌మెన్ ఇప్పటికే 600 పైగా రన్స్ సాధించాడు. అంతేకాకుండా ఐపీఎల్ ప్లేఆఫ్‌లలో కూడా ఈ బ్యాట్స్‌మెన్ బ్యాట్ ఎంతో రాణిస్తుంద‌ని గ‌ణంకాలు చెబుతున్నాయి.

గుజరాత్ టైటాన్స్ ఇద్దరు బ్యాట్స్‌మెన్ ఐపీఎల్ 2025లో తమ ప్రదర్శనతో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నారు. ఒకరు సాయి సుదర్శన్ కాగా మరొకరు కెప్టెన్ శుభ్‌మన్ గిల్. సుదర్శన్ ఇటీవలి ఫామ్ ముంబై టెన్షన్‌ను పెంచింది. అయితే సుదర్శన్ కంటే గిల్ నుండి పెద్ద ముప్పు ఉంటుంది ముంబై జ‌ట్టుకు. టీమ్ ఇండియా కోసం వన్డే క్రికెట్‌లో రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసే గిల్.. ఈ ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఆటను దెబ్బ‌తీయొచ్చు. 14 మ్యాచ్‌లలో శుభ్‌మన్ 54 సగటు, 156 స్ట్రైక్ రేట్‌తో ఆడి ఇప్పటివరకు 649 రన్స్ సాధించాడు. ఈ సీజన్‌లో అత్యధిక రన్స్ సాధించిన బ్యాట్స్‌మెన్ జాబితాలో గిల్ రెండో స్థానంలో ఉన్నాడు.

Also Read: APFU : ఏపి మత్స్య (ఫిషరీస్) పాలిటెక్నిక్ కోర్సులకు నోటిఫికేషన్ విడుదల

ప్లేఆఫ్‌లో గిల్‌ రికార్డ్

శుభ్‌మన్ గిల్ ఐపీఎల్ ప్లేఆఫ్ రికార్డ్ అద్భుతంగా ఉంది. గిల్ ఇప్పటివరకు 10 ప్లేఆఫ్ మ్యాచ్‌లలో బ్యాట్‌తో మైదానంలోకి దిగాడు. ఈ సమయంలో అతను 52.66 సగటు, 145 స్ట్రైక్ రేట్‌తో ఆడి 474 రన్స్ సాధించాడు. ఒక ఫిఫ్టీతో పాటు గిల్ ప్లేఆఫ్‌లలో ఒక సెంచరీ కూడా నమోదు చేశాడు. ఇప్పుడు గుజరాత్ కెప్టెన్ ఈ ఫామ్‌ను ముంబైకి వ్యతిరేకంగా కొనసాగించగలిగితే ముల్లంపూర్‌లోనే ముంబైను ఓడించ‌డ‌టం గుజ‌రాత్‌కు పెద్ద క‌ష్టం కాదు.