GT vs MI: ముంబైకి గుజరాత్ షాక్.. గెలుపు ముంగిట బోల్తా పడ్డ పాండ్య టీమ్

ఐపీఎల్ లో తమ తొలి మ్యాచ్ ఓడిపోయే సాంప్రదాయాన్ని ముంబై ఇండియన్స్ మరోసారి కొనసాగించింది. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో 6 పరుగుల తేడాతో పరాజయం పాలైయింది. నిజానికి ఈ మ్యాచ్ ముంబై చేజేతులా ఓడిందని చెప్పాలి.

GT vs MI: ఐపీఎల్ లో తమ తొలి మ్యాచ్ ఓడిపోయే సాంప్రదాయాన్ని ముంబై ఇండియన్స్ మరోసారి కొనసాగించింది. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో 6 పరుగుల తేడాతో పరాజయం పాలైయింది. నిజానికి ఈ మ్యాచ్ ముంబై చేజేతులా ఓడిందని చెప్పాలి. 36 బంతుల్లో 48 రన్స్ చేయాల్సి ఉండగా 7 వికెట్లు చేతిలో ఉన్నాయి. గెలుపు లాంఛనమే అనుకున్న వేళ గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ముంబై జోరుకు బ్రేక్ వేశారు. 169 పరుగుల లక్ష్య చేధనలో ఖాతా తెరవకుండానే ఇషాన్ కిషన్ డకౌట్ అవగా..ఇంపాక్ట్ ప్లేయర్ నమన్ కూడా వెనుదిరిగాడు.

అయితే రోహిత్ శర్మ, బ్రెవిస్ ధాటిగా ఆడడంతో ముంబై ఇన్నింగ్స్ సాఫీగానే సాగింది. రోహిత్ 43 , బ్రెవిస్ 46 రన్స్ కు ఔట్ అయ్యాక..తిలక్ వర్మ అనుకున్న రీతిలో భారీ షాట్లు కొట్టలేకపోయాడు. తిలక్ ఔట్ అయ్యాక టిమ్ డేవిడ్ కూడా వెనుదిరిగాడు. విజయం కోసం చివరి ఓవర్లో 19 రన్స్ చేయాల్సి ఉండగా పాండ్య మొదటి బంతిని సిక్స్, రెండో బంతిని ఫోర్ కొట్టాడు. అయితే ఉమేశ్ యాదవ్ మూడో బంతికి అతన్ని ఔట్ చేయగా..తర్వాత పీయూష్ చావ్లాను
కూడా పెవిలియన్ కు పంపడంతో ముంబై 162 పరుగులకు పరిమితమయింది.

అంతకు ముందు గుజరాత్ టైటాన్స్ 169 పరుగుల సాధారణ స్కోర్ చేసింది. జస్‌ప్రీత్ బుమ్రా నిప్పులు చెరగడంతో భారీ స్కోరు చేయలేక పోయింది. గుజరాత్ టైటాన్స్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 47 పరుగులే చేసింది.
సాయి సుదర్శన్ 39 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 45, శుభ్‌మన్ గిల్ 22 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 31 టాప్ స్కోరర్లుగా నిలవగా.. చివర్లో రాహుల్ తెవాటియా 15 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 22 ధాటిగా ఆడాడు. ముంబై బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు తీయగా.. గెరాల్డ్ కోయిట్జీ రెండు వికెట్లు పడగొట్టాడు. పియూష్ చావ్లాకు ఓ వికెట్ దక్కింది.

Also Read: GT vs MI: గుజరాత్ పై బుమ్రా విధ్వంసం