Site icon HashtagU Telugu

World Cup 2023: గుడ్ న్యూస్.. వరల్డ్ కప్‌కు అయ్యర్ రెడీ (Video)

World Cup 2023

New Web Story Copy 2023 07 12t185912.025

World Cup 2023: ప్రపంచ కప్ 2023పై ఉత్కంఠ పెరుగుతోంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఇప్పటికే షెడ్యూల్‌ను ప్రకటించింది. 12 ఏళ్ల తర్వాత భారత్ ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. రోహిత్‌కు సేన టైటిల్‌ రేసులో ఉంది. అయితే టీమిండియాలో శ్రేయాస్ అయ్యర్ లేకపోవడం జట్టుకు నష్టమే. గాయంతో జట్టుకు దూరమయ్యాడు అయ్యర్. అయితే తాజాగా అయ్యర్ మైదానంలో ప్రాక్టీస్ చేయడం ప్రతిఒక్కరిలో సంతోషం నింపింది. టీం ఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియోలో అయ్యర్ చాలా కాలం తర్వాత బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. విశేషమేమిటంటే అయ్యర్ పూర్తిగా ఫిట్‌గా కనిపిస్తూ బంతులను ఎదుర్కొంటూ కనిపించాడు. అయ్యర్ గాయం కారణంగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. తన చివరి మ్యాచ్‌ను మార్చి 2023లో ఆడాడు.

శ్రేయాస్ అయ్యర్ చాలా కాలంగా వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. దీంతో శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. ఏ సమయంలో అయ్యర్ 2023 ప్రపంచకప్‌లో ఆడటం లేదని కొన్ని నివేదికలువచ్చాయి. అయితే అవన్నీ వట్టి పుకార్లేనని తెలియజేస్తుంది అయ్యర్ తాజా ప్రాక్టీస్ వీడియో.శ్రేయాస్ అయ్యర్‌ 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఇప్పటివరకు మొత్తం 42 మ్యాచ్‌లు ఆడాడు. 46.60 సగటుతో 1,631 పరుగులు చేశాడు. ప్రపంచకప్‌లో అయ్యర్ భారత జట్టుకు అత్యుత్తమ బ్యాట్స్ మెన్ గా రాణిస్తాడని భావిస్తున్నారు.

Read More: World Cup 2023: భారత్ 2023 వరల్డ్ కప్ గెలుస్తుందా? లేదా?