Site icon HashtagU Telugu

Good news for TEAM INDIA : టీమిండియా గుడ్ న్యూస్… వాళ్ళిద్దరూ ఫిట్..!!

Team India Dubai Imresizer

Team India Dubai Imresizer

ఆసియాకప్ వైఫల్యం నుంచి బయటపడుతున్న టీమిండియాకు గుడ్ న్యూస్.. టీ ట్వంటీ ప్రపంచకప్ కోసం జట్టు ఎంపిక తేదీ దగ్గర పడుతున్న వేళ కీలక ఆటగాళ్ళు ఫిట్ నెస్ సాధించారు. గాయాల బారిన పడిన స్టార్ పేసర్ జస్ప్రీత్ బూమ్రా, మరో పేసర్ హర్షల్ పటేల్ ఫిట్ నెస్ టెస్ట్ పాసయ్యారు. దీంతో టీ ట్వంటీ వరల్డ్ కప్ జట్టు ఎంపికలో వీరిద్దరినీ సెలక్టర్లు పరిగణలోకి తీసుకోనున్నారు. గత కొన్ని రోజులుగా బెంగళూరు ఎన్ సిఎలో వీరిద్దరూ రిహాబిలిటేషన్ లో ఉన్నారు. ఇప్పుడు కోలుకుని ఫిట్ నెస్ సాధించడంతో టీమ్ మేనేజ్ మెంట్ ఊపిరి పీల్చుకుంది.

వరల్డ్ కప్ కు వీరిద్దరి ఎంపిక లాంఛనమే. ముఖ్యంగా పేస్ విభాగంలో బూమ్రా లేకపోవడం ఆసియాకప్ లో భారత అవకాశాలపై తీవ్ర ప్రభావమే చూపించింది. డెత్ ఓవర్స్ లో బూమ్రా ఎంతటి స్పెషలిస్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే ఐపీఎల్ లో నిలకడగా రాణించిన హర్షల్ పటేల్ షార్ట్ ఫార్మేట్ లో భారత్ కు కీలకంగా చెప్పొచ్చు. అలాంటిది వీరిద్దరూ లేకపోవడం పేస్ విభాగాన్ని బలహీనపరిచింది. పేస్ పిచ్ లకు అనుకూలంగా ఉండే ఆసీస్ గడ్డపై బూమ్రా, హర్షల్ పటేల్ రాక ఖచ్చితంగా జట్టుకు లాభించేదే. అయితే వీరిద్దరినీ స్వదేశంలో జరిగే సిరీస్ లకు కూడా ఎంపిక చేస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

ఫిట్ నెస్ టెస్ట్ పాసైనప్పటకీ… ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్ లో ఆడిస్తేనే వీరి మళ్ళీ గాడినపడే అవకాశముంది. కాగా సెప్టెంబర్ 16న వరల్డ్ కప్ కోసం బీసీసీఐ సెలక్టర్లు జట్టును ప్రకటించనున్నారు. ఇప్పటికే పలు దేశాలు తమ జట్లను ప్రకటించాయి. ఇదిలా ఉంటే టీ ట్వంటీ వరల్డ్ కప్ కు ముందు టీమిండియా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లతో సిరీస్ లు ఆడనుంది. ఆస్ట్రేలియాతో మూడు టీ ట్వంటీల సిరీస్ సెప్టెంబర్ 20 నుంచి ఆరంభం కానుండగా… తర్వాత సౌతాఫ్రికాతో మూడు టీ ట్వంటీలు, మూడు వన్డేలు ఆడనుంది.