ఐపీఎల్ 2022 సీజన్‌ను ఓటమితో ప్రారంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గత కొన్ని సీజన్లుగా ఈ మెగా టోర్నీ అస్సలు కలిసి రావడం లేదు. గత సీజన్ తరహాలోనే ఐపీఎల్ 2022 తొలి మ్యాచ్‌లోనూ ఎస్‌ఆర్‌హెచ్ పేలవ ప్రదర్శనను కొనసాగిస్తూ రాజస్థాన్ రాయల్స్ చేతిలో 61 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇక ఐపీఎల్ 15వ సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తన తర్వాతి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఢీకొట్టబోతోంది. సోమవారం సాయంత్రం 7:30 గంటలకు ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఇరు జట్లు పోటీపడనున్నాయి.. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్‌పై విజయం సాధించి ఫుల్ జోష్ లో ఉన్న లక్నోసూపర్ జాయింట్స్ ను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎలా అడ్డుకట్ట వేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
ఇదిలాఉంటే లక్నోతో మ్యాచ్ ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు గుడ్ న్యూస్ అందింది. అంతర్జాతీయ మ్యాచుల కారణంగా ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకు దూరమైన న్యూజిలాండ్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ సన్‌రైజర్స్ జట్టుతో చేరాడు. ఈ నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ తో జరగనున్న తదుపరి మ్యాచ్‌కు గ్లెన్ ఫిలిప్స్ అందుబాటులో ఉండనున్నాడు. ఇప్పటికే కెప్టెన్ కెన్ విలియంసన్ , ఎయిడెన్ మార్క్‌రమ్, నికోలస్ పూరన్ , రొమారియో షెప్పర్డ్ వంటి విదేశీ స్టార్ ఆటగాళ్లలో కూడి ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. గ్లెన్ ఫిలిప్స్ రాకతో మరింత బలంగా మారింది. ఇక ఐపీఎల్-2022 మెగా వేలంలో గ్లెన్ ఫిలిప్స్ ను రూ. 1.50 కోట్లు వెచ్చించి సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది… ఇదిలా ఉంటే, రాజస్థాన్ రాయల్స్ తో తో మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో దారుణంగా విఫలమై 61 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.