IPL CRICKET: తెలుగు రాష్ట్రాల క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు.. ఎప్పుడెప్పుడంటే..?

ఐపీఎల్ 2023 ఈ రోజు ఫ్యాన్స్‌కు సూపర్ మజా అందించనుంది.

  • Written By:
  • Publish Date - March 31, 2023 / 08:44 PM IST

IPL CRICKET: ఐపీఎల్ 2023 ఈ రోజు ఫ్యాన్స్‌కు సూపర్ మజా అందించనుంది. తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగనుంది. చెన్నై ఇప్పటివరకు నాలుగుసార్లు కప్ గెలవగా.. గుజరాత్ గత ఏడాది కప్ గెలిచి సూపర్ ఫామ్‌లో ఉంది. రెండూ బలమైన జట్లు కావడంతో.. తొలి మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో ఏ జట్టు బోణీ కొడుతుందనేది తెలుసుకునేందుకు ఐపీఎల్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

తొలి మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుండగా.. ఈ సారి హైదరాబాద్‌లో కూడా మ్యాచ్‌లు జరగనున్నాయి. ఏప్రిల్ 2న సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య హైదరాబాద్‌లో మ్యాచ్ జరగనుంది. ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ మ్యాచ్ జరుగుతుంది. ఆ తర్వాత ఏప్రిల్ 9న హైదరాబాద్, పంజాబ్ జట్టు మధ్య రాత్రి 7.30 గంటలకు ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది.

ఇక ఏప్రిల్ 18న హైదరాబాద్, ముంబై మధ్య, ఏప్రిల్ 24న హైదరాబాద్, ఢిల్లీ మధ్య, మే4న హైదరాబాద్, కోల్ కత్తా జట్ల మధ్య, మే13న హైదరాబాద్, లఖ్‌నవూ, మే 18న హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్‌లు జరగనున్నాయి. గత ఏడాది హైదరాబాద్‌లో మ్యాచ్‌లు జరగకపోవడంతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. హైదరాబాద్ లో మ్యాచ్‌లు పెట్టకపోవడంపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా బీసీసీఐని కోరారు. హైదరాబాద్ లో మ్యాచ్‌లు నిర్వహించాలని కోరారు.

ఈ సారి హైదరాబాద్‌లో మ్యాచ్‌లు జరుగుతుండటంతో క్రికెట్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. తెలుగు రాష్ట్రాల క్రికెట్ ఫ్యాన్స్ కు ఇది శుభవార్తగా చెప్పవచ్చు. అయితే ఈ సారి ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుంది. కొత్త కెప్టెన్‌తో పాటు ప్లేయర్ కూడా కొత్తవారిని తీసుకున్నారు.