Mohammed Shami: ప్రపంచకప్‌లో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ ప్రదర్శన అభిమానులకు చిరకాలం గుర్తుండిపోతుంది. తొలి నాలుగు మ్యాచుల్లో అవకాశమే దక్కని షమీ, తర్వాత తానేంటో నిరూపించుకున్నాడు. వ్యక్తిగతంగా ఎన్నో బాధలను భరిస్తూ షమీ చేసిన అద్భుత ప్రదర్శనపై ప్రశంసల జల్లు కురుస్తోంది. అయితే టైటిల్ మ్యాచ్ లో ఓడిపోవడంతో షమీ డ్రెస్సింగ్ రూమ్ లో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రధాని మోడీ డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లి శమిని హక్కును చేర్చుకున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా షమీ మాజీ భార్య హసీన్ జహాన్..మరోసారి షమిపై షాకింగ్ కామెంట్స్ చేసింది. షమీని దేవుడు తప్పకుండా శిక్షిస్తాడని చెప్పింది. షమీది డర్టీ మైండ్ అని.. అతడు చేసిన తప్పులకు దేవుడు కచ్చితంగా శిక్షిస్తాడని అన్నది. తాను ప్రపంచ కప్ ఫైనల్‌ను చూడలేదని, అయితే ఎవరెన్ని కుట్రలు చేసినా అంతిమ విజయం మాత్రం మంచి మనసున్నోళ్లదేనని షమీ మాజీ భార్య హసీన్ జహాన్ చేసిన కామెంట్స్ పై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. షమీ విజయాన్ని ఓర్చుకోలేకపోతున్నావని కామెంట్స్ చేస్తున్నారు. అవును మంచి వాళ్లకు దేవుడు ఎప్పుడు మంచే చేస్తాడని కౌంటర్ ఇస్తున్నారు.
Also Read: Telangana: బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఎజెండా ఒక్కటే: సీఎం యోగి