Site icon HashtagU Telugu

Rashid Khan Reply: నాలుగు రోజులు విరామం…హాయిగా నిద్రపోవడమే: రషీద్ ఖాన్ ఫన్నీ రిప్లై

Rashid Khan

gujarat titans

ఐపీఎల్ లో ఫైనల్లో బెర్త్ ఖాయం చేసుకున్న గుజరాత్ టైటాన్స్ జట్టుకు నాలుగు రోజుల విరామం దొరికింది. క్వాలిఫయర్ మ్యాచ్ లో రాజస్తాన్ ను ఓడించడంతో ఫైనల్ కు చేరింది. ఆదివారం ఫైనల్స్ లో ప్రత్యర్థిని ఢీకొట్టనుంది. అప్పటి వరకు మరో నాలుగు రోజులు సమయం ఉండగా…ఈ నాలుగు రోజుల వ్యవధిలో ఏం చేయాలి..సూచనలివ్వండంటూ…గుజరాత్ టైటాన్స్ ట్విట్టర్ హ్యాండిల్లో అడిగింది. దీనికి యూజర్లు రకరకాలుగా స్పందించారు.

ఈ నాలుగు రోజుల్లో ఏం చేయచ్చో కొందరు నెటిజన్లు సూచించారు. ఇక గుజరాత్ టైటాన్స్ జట్టు వైస్ కెప్టెన్, ఆఫ్టానిస్తాన్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ కూడా స్పందించారు. హాయిగా నిద్రపో..అంటూ నవ్వుతున్న మూడు ఎమోజీలను పోస్టు చేశాడు.కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ లో రషీద్ కీలకం వ్యవహారిస్తున్నారు. హార్దిక్ పాండ్యా ఒక మ్యాచ్ కు దూరంగా ఉన్నా…కెప్టెన్ గా రషీద్ ఖాన్ రాణించి విజయాన్నిఅందించాడు. అంతేకాదు బ్యాటింగ్, బౌలింగ్ లోనూ సత్తా చాటుతున్నాడు.