Site icon HashtagU Telugu

Jasprit Bumrah: బుమ్రా రిటైర్మెంట్ తీసుకో: మెక్‌గ్రాత్

Jasprit Bumrah

New Web Story Copy 2023 08 05t142026.773

Jasprit Bumrah: టీమిండియాలో పేసర్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం కుర్రాళ్ళు రాణిస్తున్నప్పటికీ వాళ్లపై నమ్మకం పెట్టుకోవడం సరి కాదు. ఎందుకంటే సీనియర్ బ్యాటర్లు ఒక్కసారి బ్యాట్ ఝళిపించడం మొదలుపెడితే యువ బౌలర్లకు ఆ స్థాయి బౌలింగ్ కాస్త కష్టమే. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీమిండియాకు పేసుగుర్రం జస్ప్రీత్‌ బుమ్రా అవసరం చాలానే ఉంది. వెన్నెముక సమస్యతో బాధపడుతున్న బుమ్రా ఏడాది కాలంగా జట్టుకు దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో కీలక సిరీస్ లను కోల్పోయాడు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. దాని ఫలితం ఆచోచినట్టు కనిపించింది. ఈ నెలలో ఐర్లాండ్‌, భారత జట్టు మూడు మ్యాచుల టీ20 సిరీస్‌ ఆడనున్నది. ఈ సిరీస్‌తో జస్ప్రీత్‌ బుమ్రా జాతీయ జట్టులోకి తిరిగిరానున్నాడు. ఈ సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. దాంతో ప్రతి ఒక్కరి దృష్టి బుమ్రాపైనే పడింది.

బేసిగ్గా బుమ్రా బౌలింగ్ స్టయిల్ అంటే అమితంగా ఇష్టపడే మెక్‌గ్రాత్ తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశాడు. బుమ్రా బౌలింగ్ స్టైల్ తన శరీరంపై అధిక భారాన్ని మోపుతుందని, తాను అంతర్జాతీయ క్రికెట్‌లో ఎక్కువ రోజులు కొనసాగాలంటే ఏదో ఒక ఫార్మాట్‌ నుంచి తప్పుకోవడం మంచిదని అభిప్రాయపడ్డాడు. అంటే టెస్ట్, టీ20, వన్డే ఫార్మెట్లో ఎదో ఒకదానికి రిటైర్మెంట్ ఇవ్వాలని సూచించాడు. మూడు ఫార్మెట్లో సత్తా చాటగలిగే బుమ్రా సుదీర్ఘంగా బౌలింగ్ చేయడం ద్వారా తన కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉందన్నాడు. ఈ స‌మ‌స్య‌ నుంచి బయటకు రావాలంటే తగినంత విశ్రాంతి తీసుకోవాలని కోరాడు. టీమిండియాకు ఎక్కువ కాలం అందుబాటులో ఉండాలంటే అత‌ను ఏదో ఒక ఫార్మాట్‌ నుంచి తప్పుకోవడమే సరైన నిర్ణయం అన్నాడు మెక్‌గ్రాత్‌. అయితే మెక్‌గ్రాత్‌ చేరిన కామెంట్స్ క్షణాల్లో వైరల్ గా మారాయి. బుమ్రా ఏ ఒక్క ఫార్మేట్ కి రిటైర్మెంట్ ఇచ్చినా ఆ లోటు ఎవరూ పూడ్చలేరని అంటున్నారు ఫ్యాన్స్. మెక్‌గ్రాత్‌ చేసిన కామెంట్స్ తో ఫ్యాన్స్ మాత్రం ఆందోళన చెందుతున్నారు.

Also Read: Cyber Criminals: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు, 3000 మందిపై కేసులు బుక్