India vs Australia: ఆసీస్‌కు బిగ్ షాక్.. స్టార్ ఆటగాళ్లు జట్టుకు దూరం

వన్డే వరల్డ్ కు ముందు దిగ్గజ జట్లు భారత్ ఆస్ట్రేలియా తలపడనున్నాయి. రేపు సెప్టెంబర్ 22 న భారత్ ఆసీస్ తొలి వన్డే ఆడనున్నాయి. ఈ సమయంలో ఆస్ట్రేలియా జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

India vs Australia: వన్డే వరల్డ్ కు ముందు దిగ్గజ జట్లు భారత్ ఆస్ట్రేలియా తలపడనున్నాయి. రేపు సెప్టెంబర్ 22 న భారత్ ఆసీస్ తొలి వన్డే ఆడనున్నాయి. ఈ సమయంలో ఆస్ట్రేలియా జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియా కీలక ఆటగాళ్లు గాయాల భారీన పడ్డారు. ఆసీస్ డేంజరస్ ప్లేయర్స్ మిచెల్ స్టార్క్, గ్లెయిన్ మాక్స్‌వెల్ గాయాల కారణంగా మొదటి వన్డేకి దూరమ్యారు. ఈ విషయాన్నిఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ అధికారికంగా ప్రకటించాడు. అయితే రెండో వన్డేకి అందుబాటులో ఉంటారా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. నిజానికి ఈ సిరీస్ ఇరు జట్లకు కీలకం. గ్లెన్ మ్యాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్ దూరం కావడం ఆసీస్ జట్టుపై ప్రభావం పడే అవకాశముందని అంటున్నారు విశ్లేషకులు. పైగా మిచెల్ స్టార్క్, గ్లెయిన్ మాక్స్‌వెల్ భారత్ పై అద్భుతమైన గణాంకాలు నమోదు చేశారు.

భారత్‌తో 16 వన్డేలు ఆడిన స్టార్క్ 25 వికెట్లు తీయగా.. ఆల్‌రౌండర్ మ్యాక్సీ 29 వన్డేల్లో 921 పరుగులు తీసి 4 వికెట్లు పడగొట్టాడు.మరోవైపు భారత్ కూడా ప్రయోగానికి తెరలేపింది. తొలి రెండు వన్డేలకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ దూరం కానున్నారు . భారత్, ఆస్ట్రేలియా మధ్య శుక్రవారం నుంచి 3 వన్డేల సిరీస్ ప్రారంభంకానుది. 22న తొలి వన్డే, 24 రెండో వన్డే, 27న మూడో వన్డే మ్యాచ్ జరగనుంది.

తొలి రెండు వన్డేలకు భారత జట్టులో కేఎల్ రాహుల్ , రవీంద్ర జడేజా , రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ , శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రిత్‌ బుమ్రా, జస్ప్రీతమ్‌మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.లకు చోటు దక్కింది.

Also Read: Jagan-BJP Game : కాంగ్రెస్ లో ష‌ర్మిల చేరిక శాశ్వ‌తంగా ఆగిన‌ట్టే.?