Brian Lara: అతనొక్కడే నా రికార్డ్ బ్రేక్ చేయగలడు

వెస్టిండీస్ మాజీ క్రికెటర్ బ్రియాన్ లారా టెస్ట్ క్రికెట్లో సంచలనం సృష్టించాడు. వెస్టిండీస్ తరపున 299 వన్డేలు, 131 టెస్టులు ఆడాడు. టెస్టు క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన లారా 131 మ్యాచ్‌ల్లో 11953 పరుగులు చేశాడు.

Published By: HashtagU Telugu Desk
Brian Lara And Shubman Gill

Brian Lara And Shubman Gill

Brian Lara: వెస్టిండీస్ మాజీ క్రికెటర్ బ్రియాన్ లారా టెస్ట్ క్రికెట్లో సంచలనం సృష్టించాడు. వెస్టిండీస్ తరపున 299 వన్డేలు, 131 టెస్టులు ఆడాడు. టెస్టు క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన లారా 131 మ్యాచ్‌ల్లో 11953 పరుగులు చేశాడు. అందులో 34 సెంచరీలు చేశాడు. లారా టెస్ట్ క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక 400 పరుగులు చేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. కాగా భారత యువ ఆటగాడు సబ్‌మన్ గిల్ భవిష్యత్తులో తన 400 పరుగుల రికార్డును బ్రేక్ చేస్తాడని బ్రియాన్ లారా చెప్పాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సబ్‌మాన్ గిల్ నా రెండు రికార్డులను బ్రేక్ చేయగలడు. అతను అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు. ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు సెంచరీ చేయనప్పటికీ, అతని ఆటతీరు ఆకట్టుకుందని లారా అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోని మూడు రూపాల్లోనూ సెంచరీ సాధించిన అతను వన్డేల్లోనూ డబుల్ సెంచరీ సాధించాడు. ఇంత అత్యద్భుతమైన ఆటతీరు కనబరిచిన అతడు రానున్న ఐసీసీ సిరీస్‌లోనూ అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తాడని అన్నాడు. టెస్టు క్రికెట్‌లో నా 400 పరుగుల రికార్డును అతను కచ్చితంగా అధిగమించగలడు. అలా కాకుండా కౌంటీకి వెళ్లి అక్కడ ఆడితే అక్కడ నా 501 పరుగుల రికార్డును బద్దలు కొట్టవచ్చు అని లారా అన్నాడు.

Also Read: Heart Attack Problems: కాఫీలు, టీలు తాగుతున్నారా.. అయితే గుండెపోటు రావడం ఖాయం?

  Last Updated: 07 Dec 2023, 06:54 PM IST