Site icon HashtagU Telugu

Gill Century: గిల్ సెంచరీ.. నిరాశపర్చిన కోహ్లీ, రోహిత్!

ODI Team Captain

ODI Team Captain

ఉప్పల్ స్టేడియం వేదికగా జరగుతున్న తొలి వన్డేలో రోహిత్, కోహ్లీ నిరాశపర్చినా యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 87 బంతుల్లోనే గిల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో శుభ్‌మన్ గిల్‌కు ఇది మూడో సెంచరీ. వరుసగా రెండో సెంచరీ. ఇటీవల శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో కూడా శుభ్‌మన్ గిల్ సెంచరీ (116 పరుగులు) సాధించిన సంగతి తెలిసిందే. మంచి ఫామ్‌లో ఉన్న గిల్ న్యూజిలాండ్ వన్డేలో కూడా తన దూకుడు కొనసాగిస్తున్నాడు. వరుసగా మంచి ఇన్నింగ్స్ ఆడుతూ, ఇండియాకు మంచి ఓపెనర్‌గా నిలుస్తున్నాడు. ఇక ఈ వన్డేలో భారత్ నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది.

తొలుత టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. రోహిత్ శర్మ, గిల్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. రోహిత్ శర్మ 38 బంతుల్లో 34 పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ నిరాశ పరిచాడు. కోహ్లీ 10 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. మరో యువ ఆటగాడు ఇషాన్ కిషన్ 14 బంతుల్లో 5 పరుగులే చేసి ఔటయ్యాడు. లేటెస్ట్ సెన్సేషన్ సూర్యకుమార్ యాదవ్ 26 బంతుల్లో 31 పరుగులు చేసి మిచెల్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

Exit mobile version