Site icon HashtagU Telugu

Hockey World Cup 2023 : హాకీ వరల్డ్ కప్ విజేత జర్మనీ

Hockey Imresizer

Hockey Imresizer

భారత్ వేదికగా జరిగిన పురుషుల హాకీ ప్రపంచ కప్ లో జర్మనీ విజేతగా నిలిచింది. దాదాపు 13 ఏళ్ల విరామం తర్వాత ఆ జట్టు పురుషుల హాకీలో వరల్డ్ కప్ గెలిచింది. ఆదివారం జరిగిన ప్రపంచకప్‌ హాకీ టోర్నీ ఫైనల్లో జర్మనీ ‘షూటౌట్‌’లో 5–4తో డిఫెండింగ్‌ చాంపియన్‌ బెల్జియంను ఓడించింది. ఈ మ్యాచ్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఇరు జట్లూ నువ్వా నేనా అన్నట్టు తలపడ్డాయి. నిర్ణీత సమయం ముగిసే సరికి రెండు జట్లు 3–3తో సమంగా నిలిచాయి. దీంతో ఫలితం కోసం షూటౌట్‌ నిర్వహించారు. షూటౌట్‌లో కూడా నిర్ణీత ఐదు షాట్‌ల తర్వాత రెండు జట్లు 3–3తో సమంగా నిలిచాయి. ఈ నేపథ్యంలో సడెన్‌ డెత్ తప్పలేదు. తొలి షాట్‌లో రెండు జట్ల ఆటగాళ్లు సక్సెస్ అయ్యాయి. రెండో షాట్‌లో జర్మనీ సఫలంకాగా… బెల్జియం ఆటగాడు విఫలంకావడంతో జర్మనీ విజయం ఖరారైంది. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌ జట్ల తర్వాత మూడుసార్లు ప్రపంచకప్‌ నెగ్గిన మూడో జట్టుగా జర్మనీ రికార్డులకెక్కింది. జర్మనీ 2002, 2006ల లో టైటిల్‌ నెగ్గింది. కాంస్య పతకం మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ 3–1తో ఆస్ట్రేలియాను ఓడించింది. ఇదిలా ఉంటే ఆతిథ్య భారత్ ఈ మెగా టోర్నీని 9వ స్థానంలో ముగించింది. వర్గీకరణ పోరులో భారత్ 5-2 గోల్స్ తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది.