Site icon HashtagU Telugu

Gambhir Warning: ఆటగాళ్లకు క్లాస్ పీకిన హెడ్ కోచ్ గంభీర్

BCCI Meeting With Rohit

BCCI Meeting With Rohit

Gambhir Warning: భారత్-శ్రీలంక జట్ల మధ్య జరిగిన తొలి వన్డే మ్యాచ్ టై అయిన విషయం తెలిసిందే. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. టీమిండియా 230 పరుగులకు ఆలౌటైంది. 13 బంతుల్లో ఒక పరుగు చేయాల్సి ఉండగా టీమిండియా ఢిఫెండెంగ్ చేయలేకపోయింది. అయితే గెలవాల్సిన మ్యాచ్ లో టై కావడానికి అనేక కారణాలు ఉన్నాయి.

శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. శ్రీలంక జట్టుకు శుభారంభం లేకపోవడంతో నిర్ణీత వ్యవధిలో వికెట్లు కోల్పోయింది. ఇంత జరిగినా భారత జట్టు 50 ఓవర్లలో శ్రీలంకను ఆలౌట్ చేయలేకపోయింది. ఈ విషయంలో బౌలర్లు ఫెయిల్ అయ్యారు. ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మెన్‌లపై మరోసారి భారత బౌలర్లు ఒత్తిడి తేలేకపోయారు. వాస్తవానికి ఒక దశలో ఆ టీమ్ 26.3 ఓవర్లలో 101 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. స్పిన్నర్లు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి లంక బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. అయితే ఆ ఊపును కంటిన్యూ చేయలేకపోయారు.

ఓపెనర్ నిస్సంక, వెల్లాలగె టీమిండియా బౌలర్ల జోరును అడ్డుకున్నారు. నిస్సంక 75 బంతుల్లో 56 పరుగులతో హాఫ్ సెంచరీ చేయగా.. చివర్లో వెల్లాలగె ధాటిగా ఆడుతూ 65 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్ లతో 66 పరుగులతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఫలితంగా లంక 230 స్కోర్ చేయగలిగింది. ఇక శ్రీలంక నిర్దేశించిన 231 పరుగుల సులువైన లక్ష్యాన్ని ఛేదిస్తున్న టీమిండియాకు రోహిత్ శర్మ శుభారంభం అందించాడు. యాభై పరుగులు చేసిన తర్వాత అతను ఔటయ్యాడు. కానీ దీని తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్లు నెమ్మదిగా బ్యాటింగ్ చేశారు. స్లో బ్యాటింగ్ కారణంగా స్కోర్ బోర్డు నెమ్మదించింది. ఒక దశలో మనోళ్లు లంక బౌలర్ల ముందు నిస్సహాయంగా కనిపించారు. డాట్ బాల్స్ ఎక్కువవుతున్నా కొద్దీ ఆటగాళ్లలో ఒత్తిడి పెరుగుతూ వచ్చింది.

శుభ్‌మన్ గిల్ 35 బంతుల్లో 16 పరుగులు, విరాట్ కోహ్లీ 32 బంతుల్లో 24 పరుగులు, కేఎల్ రాహుల్ 43 బంతుల్లో 31 పరుగులు, అక్షర్ పటేల్ 57 బంతుల్లో 33 పరుగులు చేశారు. మేనేజ్మెంట్ వాషింగ్టన్ సుందర్‌ను 4వ నంబర్‌లో బ్యాటింగ్‌కు పంపింది. సహజంగానే సుందర్‌ని ఏ నంబర్‌కు పంపాలి అనేది మేనేజ్‌మెంట్ కాల్ అవుతుంది. కానీ ఈ విధంగా అకస్మాత్తుగా అతని బ్యాటింగ్ ఆర్డర్ను మార్చేశారు, ఫలితం ప్రతికూలంగా మారింది. సుందర్ 4 బంతుల్లో 5 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.మ్యాచ్‌ టై కావడంపై గౌతమ్‌ గంభీర్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌కి వెళ్ళాడట. రోహిత్‌ శర్మ నుంచి మంచి స్టార్ట్‌ లభించినా.. మిగతా బ్యాటర్లు ఎందుకు దాన్ని కంటిన్యూ చేయలేకపోయారని ప్రతి ఒక్కరికి క్లాస్ పీకినట్టు తెలుస్తుంది. ఏదేమైనా హెడ్‌ కోచ్‌గా తొలి వన్డేలో ఇలాంటి ఫలితం రావడంతో గంభీర్‌ జీర్ణించుకోలేకపోతున్నాడు.

Also Read: IAS Officers: తెలంగాణలో 8 మంది ఐఏఎస్‌ అధికారుల బదిలీ