Rohit Sharma: ప్రపంచకప్ ముగిసింది. తర్వాత టీమిండియా టి20 ప్రపంచకప్ కోసం రెడీ అవుతుంది. దానికి ముందు టీమిండియా ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్ ల సిరీస్ ఆడనుంది. అయితే టి20 ఫార్మేట్ కు రోహిత్ ఉండాలా లేదా అన్న చర్చ ప్రధానంగా నడుస్తుంది. ఈ విషయంలో బీసీసీఐ కూడా రోహిత్ ని సంప్రదించి ఓ నిర్ణయానికి రానుంది. ప్రస్తుతం టి20 మ్యాచ్ లకు హార్దిక్ పాండ్య కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే రానున్న టి20 ప్రపంచకప్ కు మాత్రం రోహిత్ ను కెప్టెన్ గా చేయాలనీ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. వచ్చే పొట్టి టోర్నీలో రోహిత్ తో పాటు కోహ్లీ ఆడాలని గంభీర్ అభిప్రాయపడుతున్నాడు.
అమెరికా-వెస్టిండీస్ వేదికగా జరిగే ప్రపంచకప్‌కు రోహిత్, కోహ్లీ పేర్లు కచ్చితంగా ఉండాలని గంభీర్ సూచించాడు. టి20 ప్రపంచకప్ కు టీమిండియాకు నాయకత్వం వహించే అవకాశం రోహిత్ శర్మకు ఇవ్వాలని బీసీసీఐ కి సూచించాడు. టి20 కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా కంటే రోహిత్ కెప్టెన్ అయితే బాగుంటుందని చెప్పాడు. గడిచిన ప్రపంచకప్‌లో రోహిత్ అద్భుతంగ కెప్టెన్సీ చేశాడని కొనియాడాడు. పైగా పవర్‌ప్లేలో రోహిత్ అద్భుతంగా ఆడాడని ప్రశంసించాడు. అందుకే రోహిత్‌ని టీ20ల్లోకి తీసుకోవాలి. రోహిత్ జట్టులోకి వస్తే కోహ్లీ కూడా వస్తాడు అని చెప్పాడు.రోహిత్‌ను తీసుకోవాలని గౌతమ్ గంభీర్ సూచిస్తున్నప్పటికీ, గత సంవత్సరం నుండి హిట్‌మ్యాన్ పొట్టి ఫార్మాట్‌లో ఆడలేదు.
Also Read: Naga Chaitanya Thandel : నాగ చైతన్య తండేల్.. టైటిల్ వెనక రీజన్ అదేనా..!