2027 ODI World: వారిద్దరికీ రిటైర్మెంట్ లేదు జడేజా కెరీర్ ముగియలేదన్న గంభీర్

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వరల్డ్ కప్ ప్రణాళికల్లో ఉన్నారా అన్న ప్రశ్నకు గంభీర్ క్లారిటీ ఇచ్చేశాడు. వారిద్దరికీ రిటైర్మెంట్ లేదన్న గంభీర్ ఫిట్ గా ఉంటే 2027 వన్డే వరల్డ్ కప్ ఆడాతారని చెప్పాడు. వారిద్దరూ వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ అని, జట్టులో ఖచ్చితంగా ఉంటారని చెప్పుకొచ్చాడు. వారిద్దరిలో ఇంకా చాలాకాలం క్రికెట్ ఆడే సత్తా ఉందన్నాడు.

2027 ODI World: టీమిండియా కోచ్ గా గౌతమ్ గంభీర్ ప్రస్థానం షురూ అయింది. శ్రీలంకతో సిరీస్ కు ముందు అధికారికంగా గంభీర్ బాధ్యతలు తీసుకున్నాడు. టూర్ కు వెళ్ళే ముందు మీడియాతో మాట్లాడి చాలా ప్రశ్నలకు క్లారిటీ ఇచ్చాడు. ముఖ్యంగా లంకతో సిరీస్ కోసం జట్టు ఎంపికలో తీసుకున్న నిర్ణయాలపై స్పందించాడు. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వరల్డ్ కప్ ప్రణాళికల్లో ఉన్నారా అన్న ప్రశ్నకు గంభీర్ క్లారిటీ ఇచ్చేశాడు. వారిద్దరికీ రిటైర్మెంట్ లేదన్న గంభీర్ ఫిట్ గా ఉంటే 2027 వన్డే వరల్డ్ కప్ ఆడాతారని చెప్పాడు. వారిద్దరూ వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ అని, జట్టులో ఖచ్చితంగా ఉంటారని చెప్పుకొచ్చాడు. వారిద్దరిలో ఇంకా చాలాకాలం క్రికెట్ ఆడే సత్తా ఉందన్నాడు.

ఇక కోహ్లీతో విభేదాలపైనా జరుగుతున్న చర్చకు కొత్త కోచ్ ఫుల్ స్టాప్ పెట్టేశాడు. కోహ్లీతో ఎలాంటి గొడవలు లేవన్నాడు. టీఆర్పీ రేటింగ్స్ కోసమే విరాట్ తో తన ఫ్రెండ్ షిప్ ఉండదంటూ గంభీర్ మీడియాపై సెటైర్లు వేశాడు. ఏ ప్లేయర్ అయినా తన జట్టు విజయం కోసం తపనపడతాడని ఆ క్రమంలో గతంలో ఇద్దరి మధ్య ఉద్వేగం చోటు చేసుకున్నట్టు చెప్పాడు. అయితే తామిద్దరం ఇప్పుడు భారత్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నామని గుర్తు చేశాడు. కోహ్లీతో తన రిలేషన్ ఎప్పుడూ బాగానే ఉందన్న గంభీర్ జట్టు విజయం కోసం కలిసికట్టుగా ప్రయత్నిస్తామని తేల్చేశాడు.

ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను ఎంపిక చేయకపోవడంతో అతని కెరీర్ ముగిసినట్టేనని వార్తలు వినిపించాయి. దీనిపై గంభీర్ సూటిగా జవాబిచ్చాడు. జడేజాను తప్పించలేదని సెప్టెంబర్ నుంచి కీలక టెస్టు సిరీస్‌లు మొదలుకానున్న నేపథ్యంలో విశ్రాంతి ఇచ్చామని గంభీర్ స్పష్టం చేశాడు. మూడు వన్డేల సిరీస్‌లకు ఎంపిక చేయనంత మాత్రాన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రణాళికలో జడేజా లేనట్లు కాదన్నాడు. మరోవైపు అజిత్ అగార్కర్ కూడా దీనిపై మాట్లాడాడు. దీర్ఘ టెస్టు షెడ్యూల్ ఉందని, అందుకే జడేజాకు రెస్ట్ ఇచ్చామన్నాడు. అయితే అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాను ఇద్దరినీ ఎంపిక చేయలేమని, ఇద్దరిలో ఒకరు బెంచ్‌రే పరిమితం కావాల్సి ఉంటుందని అగార్కర్ తేల్చేశాడు. వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ లక్ష్యంగానే వన్డే జట్టు కూర్పుపై దృష్టి పెట్టిన గంభీర్ కోహ్లీ, రోహిత్ లను ఎంపిక చేసి…జడేజాను మాత్రం పక్కన పెట్టడంతో ఇలాంటి వార్తలు వచ్చాయి. ఇప్పుడు జడేజా కూడా వన్డే, టెస్టులకు తమ ప్రణాళికల్లో ఉన్నాడని కొత్త కోచ్ తేల్చిచెప్పడంతో అలాంటి వార్తలకు తెరపడినట్టైంది.

Also Read: Lakhimpur Kheri case : లఖింపుర్ ఖేరి కేసులో ఆశిష్ మిశ్రాకు సుప్రీం బెయిల్‌

Follow us