Site icon HashtagU Telugu

IPL 2024: కేకేఆర్ లోకి గంభీర్ ?

IPL 2024

New Web Story Copy 2023 07 12t183800.063

IPL 2024: ఫ్రాంచైజీ లక్నో సూపర్‌జెయింట్స్ మెంటార్ గౌతమ్ గంభీర్ తన పాత జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ లోకి వెల్లనున్నాడా అంటే అవుననే అంటున్నారు ఐపీఎల్ నిర్వాహకులు. నిజానికి గౌతమ్ కెప్టెన్సీలో కేకేఆర్ రెండుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది. అనంతరం గంభీర్ లక్నోకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. డిసెంబర్ 2021లో గంభీర్‌ను మెంటార్‌గా చేసింది లక్నో. గంభీర్ పర్యవేక్షణలో లక్నో 2022 మరియు 2023లో వరుసగా రెండు సంవత్సరాల పాటు మొదటి నాలుగు స్థానాల్లో నిలిచింది మరియు క్వాలిఫైయర్‌లకు చేరుకుంది, కానీ విజేతగా నిలవలేకపోయింది. ఇదిలా ఉండగా గంభీర్ మళ్ళీ కేకేఆర్ లోకి వెళ్ళబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. గంభీర్ కోల్ కత్తా యాజమాన్యం మధ్య చర్చలు జరుగుతున్నాయి. 2024 ఐపీఎల్ లో గంభీర్ కేకేఆర్ జట్టులో ఉంటాడన్నది ప్రధానంగా వినిపిస్తున్నది. గంభీర్‌ను 2011 వేలంలో కేకేఆర్ దక్కించుకుంది. అతని కెప్టెన్సీలో జట్టు 2012 మరియు 2014 లో ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. అనంతరం కేకేఆర్ ఢీలా పడిపోయింది. ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది. గత సీజన్‌లో చంద్రకాంత్ పండిత్‌ను జట్టు ప్రధాన కోచ్‌గా చేసింది.ఆయన సారధ్యంలో కేకేఆర్ ప్రదర్శన చాలా నిరాశపరిచింది మరియు జట్టు ఏడవ స్థానంలో నిలిచింది. ఈ పరిస్థితిలో కేకేఆర్ మళ్లీ గంభీర్‌ను తీసుకోవాలని భావిస్తుంది.

Read More: World Cup 2023: భారత్ 2023 వరల్డ్ కప్ గెలుస్తుందా? లేదా?