Site icon HashtagU Telugu

Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్‌గా గౌత‌మ్ గంభీర్‌.. తొలి టూర్ ఇదే..!

Gautam Gambhir

Gautam Gambhir

Gautam Gambhir: జింబాబ్వే టూర్ తర్వాత టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో టీమిండియా వన్డే, టీ20 సిరీస్‌లు ఆడాల్సి ఉంది. ఈ పర్యటనలో టీమిండియా కొత్త ప్రధాన కోచ్‌గా గౌతమ్‌ గంభీర్ (Gautam Gambhir) ఉండే అవ‌కాశం ఉంది. శ్రీలంక పర్యటనలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా వంటి సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వ‌నున్న విష‌యం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ టూర్‌కి సంబంధించి టీమిండియా ప్రకటనపైనే అభిమానులు దృష్టి సారించారు.

వచ్చే వారం 2 పెద్ద ప్రకటనలు ఉండే ఛాన్స్‌

నివేదికల ప్రకారం.. బీసీసీఐ వచ్చే వారం రెండు పెద్ద ప్రకటనలు చేసే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. అందులో ఒకటి శ్రీలంక టూర్‌కు టీం ఇండియాను ప్రకటించడం, మరొకటి టీమ్ ఇండియా కొత్త ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్‌ను నియమించడం లాంటి ప్ర‌క‌ట‌న‌లు ఉండ‌వ‌చ్చ‌ని నివేదిక‌లు చెబుతున్నాయి.

శ్రీలంక టూర్‌లో టీమిండియా కీలక ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రాలకు విశ్రాంతినిస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కి తెలిపాయి. ఈ టూర్‌లో టీమిండియా కెప్టెన్ గురించి మాట్లాడితే.. ఇద్దరు ఆటగాళ్ల పేర్లు తెరపైకి వస్తున్నాయి. కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యాలలో ఎవరినైనా శ్రీలంకతో సిరీస్‌కు కెప్టెన్‌గా ఉండ‌వ‌చ్చ‌ని తెలుస్తోంది.

Also Read: Sri Lanka Tour: సెప్టెంబ‌ర్ వ‌ర‌కు క్రికెట్‌కు దూరం కానున్న టీమిండియా స్టార్ ప్లేయ‌ర్స్‌..!

గౌతమ్ గంభీర్ జీతంపై బీసీసీఐ చర్చ

టీ20 ప్రపంచకప్ 2024 తర్వాత టీమ్ ఇండియా ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసింది. అయితే ప్రపంచకప్‌కు ముందే బీసీసీఐ టీమ్ ఇండియాకు కొత్త ప్రధాన కోచ్ కోసం అన్వేషణ మొదలుపెట్టింది. ఇందులో ఇప్పుడు భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ పేరు ముందంజలో ఉంది. గంభీర్‌ త్వరలో ప్రధాన కోచ్‌గా నియమితులయ్యే అవకాశం ఉంది. ప్రధాన కోచ్ పదవి కోసం బీసీసీఐ ఇప్పటికే గంభీర్‌ను ఇంటర్వ్యూ చేసింది. నివేదికల ప్రకారం.. గంభీర్ జీతం గురించి చర్చలు జరుగుతున్నందున గంభీర్ కోచ్ కావడం ఆలస్యం అవుతోంది. బీసీసీఐ త్వరలో టీం ఇండియా కోచింగ్‌ స్టాఫ్‌ పోస్టులను కూడా నియ‌మించ‌నుంది.

We’re now on WhatsApp : Click to Join