Site icon HashtagU Telugu

Gautam Gambhir: నా ఇంట్లో డబ్బులు కాసే చెట్టు లేదు

Gautam Gambhir

Gautam Gambhir

టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ ఈ ఏడాది ఐపీఎల్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ మెంటార్‌గా వ్యవహరించాడు. 2011 వరల్డ్‌కప్‌ విజయంలో కీలకపాత్ర పోషించిన గంభీర్‌.. గత లోక్‌సభ ఎన్నికల్లో ఈస్ట్‌ ఢిల్లీ నుంచి ఎంపీగా ఎన్నికయ్యాడు. అయితే అతడు ఐపీఎల్‌లో పార్టిసిపేట్‌ చేయడంపై రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు గుప్పించారు. తన నియోజకవర్గం గురించి మాత్రం గంభీర్‌ పట్టించుకోడని విమర్శించారు. గంభీర్ డబ్బు కోసమే ఇటు ఎంపీగా ఉంటూ మళ్ళీ క్రికెట్ లో భాగమవుతున్నాడని పలువురు కామెంట్లు చేశారు.

తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న గంభీర్​.. ఈ విమర్శలపై స్పందించాడు. ప్రస్తుతం ఢిల్లీలోని తూర్పు నియోజకవర్గానికి ఎంపీగా సేవలందిస్తున్న తాను గాంధీనగర్​లో పేదల కోసం జన్​రసోయ్​ పేరుతో ఒక్క రూపాయికే భోజనం అందేలా కేంద్రాన్ని ఏర్పాటు చేశానని చెప్పాడు. అలాగే ఆ ప్రాంతంలోనే 25 లక్షలు ఖర్చుతో ఓ లైబ్రరీని కూడా ఏర్పాటు చేసిన విషయాన్ని వెల్లడించాడు.

ప్రతినెలా పేదలకు ఉచిత భోజనం అందించేందుకు 25 లక్షలు ఖర్చు పెడుతున్నాననీ చెప్పుకొచ్చాడు. తన సొంతడబ్బులతో ఈ పనులన్నీ చేస్తున్నానీ, వీటి నిర్వహణకు డబ్బు చాలా అవసరం ఉందన్నాడు. అందుకే డబ్బు కోసం నేను అటు రాజకీయాల్లో ఇటు క్రికెట్ లో పనిచేసెందుకు తానేం సిగ్గు పడట్లేదని గంభీర్ చెప్పుకొచ్చాడు. ఎంపీల్యాడ్స్‌ నిధుల నుంచి వీటికి తాను ఖర్చు చేయడం లేదన్నాడు. ఎంపీల్యాడ్స్‌ నా కిచెన్‌నో లేక నా ఇతర పనులనో నడిపించదు. నా ఇంట్లో డబ్బులు కాసే చెట్టు లేదఅంటూ కాస్త వ్యంగ్యంగా స్పందించాడు.
భారత్ తరఫున గంభీర్‌ భారత్‌ తరపున 58 టెస్ట్‌లు, 147 వన్డేలు, 37 టీ20లకు ప్రాతినిథ్యం వహించాడు.అలాగే 154 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడాడు. సారథిగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టుకు రెండుసార్లు టైటిల్‌ అందించిన గంభీర్ ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు మార్గనిర్దేశకుడుగా ఉన్నాడు.గంభీర్‌ లక్నో టీమ్‌కు పని చేయడంతోపాటు స్టార్‌కు కామెంటేటర్‌గానూ చేస్తున్నాడు.

Exit mobile version