Site icon HashtagU Telugu

Gambhir- Agarkar: టీమిండియాను నాశ‌నం చేస్తున్న అగార్క‌ర్‌, గంభీర్!

Gambhir- Agarkar

Gambhir- Agarkar

Gambhir- Agarkar: భారత జట్టు దక్షిణాఫ్రికా చేతిలో రెండో వన్డేలో 4 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. స్కోరు బోర్డుపై 358 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికీ టీమ్ ఇండియా బౌలర్లు ఈ పెద్ద లక్ష్యాన్ని కాపాడుకోవడంలో విఫలమయ్యారు. రాయ్‌పూర్‌లో ఎదురైన ఈ ఓటమితో భారత క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది.

బౌలర్ల దారుణ ప్రదర్శనపై అభిమానులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడమే కాకుండా.. జట్టు ఎంపికపై కూడా సోషల్ మీడియాలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ (Gambhir- Agarkar) తీవ్రంగా ట్రోల్ అవుతున్నారు. ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా రెండో వన్డేలో ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంతో టీమ్ ఇండియా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.

గంభీర్-అగార్కర్ పై ట్రోలింగ్

రాయ్‌పూర్‌లో టీమ్ ఇండియా ఓటమి తర్వాత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ అభిమానుల నిందలకు గురయ్యారు. రెండో వన్డే మ్యాచ్‌లో భారత బౌలర్లు 359 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయారు. ఒక అభిమాని గంభీర్-అగార్కర్‌ను ట్రోల్ చేస్తూ తన ఎక్స్ (X) ఖాతాలో “గౌతమ్ గంభీర్- అజిత్ అగార్కర్ జట్టు ఎంపికలో పక్షపాతం చూపించి భారత క్రికెట్‌ను నాశనం చేశారు” అని రాశాడు.

Also Read: Vladimir Putin: ప్రధాని మోదీ ఒత్తిడికి లొంగే నాయకుడు కాదు: వ్లాదిమిర్ పుతిన్

మరో అభిమాని “గౌతమ్ గంభీర్ ప్రదర్శన చూస్తుంటే ఐపీఎల్ సమయంలో దేశీయ పరిస్థితుల్లో ఎలా గెలవాలో ఆయన నేర్చుకోవాలి” అని రాశారు. సోషల్ మీడియాలో హర్షిత్ రాణా ఎంపికపై కూడా అభిమానులు అనేక రకాల ప్రశ్నలు లేవనెత్తారు. ప్రసిద్ధ్ కృష్ణ కూడా విపరీతంగా ట్రోల్ అవుతున్నారు.

భారత పేసర్లు పరువు తీశారు

రెండో వన్డేలో టీమ్ ఇండియా పేసర్లు జట్టు పరువు తీయడంలో ఏమాత్రం వెనుకాడలేదు. ప్రసిద్ధ్ కృష్ణ పరుగులు భారీగా ఇచ్చేశాడు. తన 8.2 ఓవర్ల స్పెల్‌లో ఏకంగా 85 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక కుల్దీప్ యాదవ్ 10 ఓవర్లలో 78 పరుగులు ఇచ్చాడు. హర్షిత్ రాణా పరిస్థితి కూడా ఇలాగే ఉంది. హర్షిత్ 70 పరుగులు ఇవ్వగా, జడేజా ఒక్క వికెట్ కూడా తీయకుండా 41 పరుగులు ఇచ్చాడు. వాషింగ్టన్ సుందర్‌కు కేవలం 4 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసే అవకాశం లభించింది. అందులో అతను 28 పరుగులు ఇచ్చాడు.

Exit mobile version