Site icon HashtagU Telugu

Gambhir- Agarkar: మ‌రోసారి అగ‌ర్కార్‌- గంభీర్ మ‌ధ్య వాగ్వాదం.. ఈ ఆట‌గాళ్ల కోస‌మేనా?

Gambhir- Agarkar

Gambhir- Agarkar

Gambhir- Agarkar: ప్రస్తుతం టీమ్ ఇండియా ఛాంపియ‌న్స్ ట్రోఫీకి సిద్ధ‌మ‌వుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఏ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలి? ఎవరికి అవకాశం ఇవ్వకూడదు అనే విషయంలో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, భారత జట్టు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Gambhir- Agarkar) మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని వార్త‌లు వ‌స్తున్నాయి. భారత ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో శ్రేయాస్ అయ్యర్, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్, కెఎల్ రాహుల్‌లను చేర్చుకోవడంపై గంభీర్, అగార్కర్‌లు ఏకాభిప్రాయం వ్యక్తం చేయలేదని, దీనిపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని వాదనలు వినిపిస్తున్నాయి.

‘టైమ్స్ ఆఫ్ ఇండియా’లోని ఒక నివేదిక ప్రకారం.. అయ్యర్‌ను జట్టులో ఉంచడం, KL రాహుల్- రిషబ్ పంత్ మధ్య వన్డేలకు మొదటి ఎంపిక వికెట్ కీపర్‌పై చర్చ జరిగినట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అందులో వికెట్ కీపర్‌గా పంత్ మొదటి ఎంపిక అని ఛాంపియన్స్ ట్రోఫీ జట్టును ప్రకటించినప్పుడు సెలక్షన్ కమిటీ హెడ్ అగార్కర్ పేర్కొన్నాడు. ఇంగ్లండ్ సిరీస్‌లో మూడు వన్డేల్లో ఆడే అవకాశం లభించని ఏకైక ఆటగాడు పంత్ మాత్రమే.

Also Read: CUET UG 2025 Application: సీయూఈటీ యూజీ 2025 కోసం రిజిస్ట్రేషన్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?

ఇంగ్లండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో విరాట్ స్థానంలో అయ్యర్ ఆడాడు

భారతదేశం- ఇంగ్లండ్ మధ్య జరిగిన మొదటి ODI నుండి అయ్యర్‌ను దూరంగా ఉంచిన విష‌యం మ‌న‌కు తెలిసిందే. అయితే చివరి క్షణంలో విరాట్ కోహ్లీ గాయపడటంతో అతను ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చబడ్డాడు. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. దీనిపై జట్టు దుబాయ్ వెళ్లే ముందు గంభీర్ మాట్లాడుతూ.. సిరీస్ మొత్తంలో అయ్యర్‌ను బెంచ్‌పై కూర్చోబెట్టి ఉండాల్సింది కాదని చెప్పాడు. వన్డేల్లో యశస్వి జైస్వాల్‌కు అవకాశం ఇవ్వాలని కోరుతున్నానని, అందుకే అరంగేట్రం చేసే అవకాశం ఇచ్చానని చెప్పాడు. ఇదే సమయంలో అయ్యర్ ఇంగ్లండ్‌పై రెండు అర్ధ సెంచరీలు సాధించాడు. తద్వారా 4వ నంబర్ బ్యాట్స్‌మన్‌గా అతని స్థానాన్ని ధృవీకరించాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం భారత జట్టు