Site icon HashtagU Telugu

Gautam Gambhir: పాక్‌పై గెలవాలంటే ఇలా చేయండి.. గౌతమ్ గంభీర్ సూచ‌న‌లు..!

gautam gambhir

gautam gambhir

మరో మూడు రోజుల్లో ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్ర‌పంచ‌క‌ప్ పోరు ప్రారంభ‌కానున్న విష‌యం తెలిసిందే. ఈ టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో టీమిండియా తన తొలి మ్యాచ్‌ను చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాకిస్థాన్‌తో త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా ఓపెనర్స్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌కు టీమిండియా మాజీ ఓపెన‌ర్‌ గౌతమ్ గంభీర్ కొన్ని కీల‌క సూచ‌నలు ఇచ్చాడు. గతేడాది టీ20 వరల్డ్ కప్‌లో పాక్‌పై ఓడిన టీమిండియాకు మ‌రోసారి అలాంటి పొర‌పాటు చేయ‌కుండా ఉండాలిని వారిని హెచ్చ‌రించాడు.

‘గత టీ20 వరల్డ్ కప్‌లో భారత ఓటమికి ప్రధాన కారణం పాకిస్థాన్‌ బౌలర్ షాహీన్ అఫ్రిది. అతడి బౌలింగ్‌లో భారత ఓపెనర్లు ఎటాకింగ్ గేమ్ ఆడకుండా వికెట్ కాపాడుకునేందుకు ప్ర‌యత్నించి త్వరగా వికెట్లు కోల్పోయారు. టీమిండియా స్టార్ బ్యాటర్ కోహ్లీ సైతం అతడి బౌలింగ్‌లో ఢిపెడింగ్ గేమ్ ఆడి ఔట్ అయ్యాడు. కానీ ఈ సారి భారత ఓపెనర్లు ఆ తప్పు చేయవద్దు. షాహీన్ అఫ్రిదీ బౌలింగ్‌లో ఎటాకింగ్ గేమ్ ఆడుతూ పరుగులు రాబట్టాలి. అప్పుడే ప్రత్యర్థి బౌలర్‌పై ఒత్తిడి పెరిగి లయ తప్పుతాడు.

టీ20 ఫార్మాట్‌లో వికెట్ కాపాడుకునేందుకు ప్రయత్నించకూడ‌దు. బంతిని బలంగా కొట్ట‌డం కంటే సరైన గ్యాప్‌ల్లో ఆడాలి. కొత్త బంతితో అఫ్రిదీ డేంజర్‌ బౌలర్ అయినప్పటికీ.. అతడి బౌలింగ్‌లో పరుగులు చేయకపోతే అది భార‌త్ జ‌ట్టుకు ఇబ్బందిగా మారుతుంది. అయిన ప్రస్తుత భారత బ్యాటింగ్ లైనప్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది.. అఫ్రిదీని ధీటుగా ఎదుర్కొనే టాప్ 4 బ్యాటర్స్ భారత జట్టులో ఉన్నారు” అని గంభీర్ అన్నారు. అక్టోబ‌ర్ 23న జ‌ర‌గబోయే మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఆస‌క్తిక‌రంగా ఎదురుచూస్తున్నారు.