Saurav Ganguly: మళ్లీ కెప్టెన్ గా దాదా

భారత క్రికెట్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ...టీమిండియాకు దూకుడు నేర్పిన సారథి...దాదా కెప్టెన్సీ లో భారత్ ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందుకుంది.

  • Written By:
  • Publish Date - August 13, 2022 / 12:07 PM IST

భారత క్రికెట్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ…టీమిండియాకు దూకుడు నేర్పిన సారథి…దాదా కెప్టెన్సీ లో భారత్ ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందుకుంది. రిటైర్ మెంట్ తర్వాత అడ్మినిస్ట్రేషన్ లో దాదా తనదయిన ముద్ర వేస్తున్నాడు. ప్రస్తుతం బీసీసీఐ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్న గంగూలీ చాలా కాలం తర్వాత కెప్టెన్ గా మైదానంలోకి అడుగు పెట్టనున్నాడు. లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌ (ఎల్‌ఎల్‌సీ)లో ఇండియా మహరాజాస్ టీమ్కు కెప్టెన్గా ఉండనున్నాడు. భారత స్వతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని ఇండియా మహరాజాస్, వరల్డ్ జెయింట్స్ మధ్య లెజెండ్స్ లీగ్ క్రికెట్ లో ఓ స్పెషల్ మ్యాచ్ జరగనుంది. సెప్టెంబర్ 16న జరగబోయే ఈ మ్యాచ్ కోసం ఇండియా మహరాజాస్ టీమ్కు గంగూలీ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. అటు వరల్డ్ జెయింట్స్ టీమ్కు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కెప్టెన్ గా ఎంపిక.ఎంపికయ్యాడు. ఈ మ్యాచ్ కు చారిత్రక ఈడెన్ గార్డెన్స్ వేదిక కానుంది.
దాదా జట్టులో వీరేంద్ర సెహ్వాగ్‌, మహ్మద్‌ కైఫ్‌, యూసఫ్‌ పఠాన్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌ సహా మొత్తం 17 మంది ఆటగాళ్లు ఉన్నారు. ఇక వరల్డ్‌ జెయింట్స్‌లో వెస్టిండీస్‌ దిగ్గజం లెండిల్‌ సిమన్స్‌, ప్రొటిస్‌ మాజీ ప్లేయర్‌ హర్షల్‌ గిబ్స్‌, శ్రీలంక లెజెండ్‌ సనత్‌ జయసూర్య వంటి 17 మంది మాజీ క్రికెటర్లకు చోటు దక్కింది.
భారత్ 75వ స్వాతంత్ర్య దినోత్సవాలు జరుపుకుంటున్న వేళ ఈ ఏడాది లీగ్ ను దేశానికి అంకితమిస్తున్నట్లు ఎల్ఎల్సీ కమిషనర్ రవిశాస్త్రి చెప్పాడు. దీనిలో భాగంగానే ప్రత్యేక మ్యాచ్ నిర్వహిస్తున్నట్టు తెలిపాడు. గతేడాదే లెజెండ్స్ లీగ్‌ క్రికెట్‌ ప్రారంభమయింది. ఈ ఏడాది ఈ స్పెషల్‌ మ్యాచ్‌ తర్వాత లీగ్‌ ప్రారంభమవుతుందని రవిశాస్త్రి వెల్లడించాడు. ఈసారి నాలుగు టీమ్స్‌ లీగ్‌లో ఆడుతుండగా.. 22 రోజుల వ్యవధిలో మొత్తం 15 మ్యాచ్‌లు జరుగుతాయి.

ఇండియా మహరాజాస్‌ జట్టు:
సౌరవ్‌ గంగూలీ(కెప్టెన్‌), వీరేంద్ర సెహ్వాగ్‌, మహ్మద్‌ కైఫ్‌,యూసఫ్‌ పఠాన్‌, సుబ్రహ్మణ్యం బద్రీనాథ్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, పార్థివ్‌ పటేల్‌(వికెట్‌ కీపర్‌), స్టువర్ట్‌ బిన్నీ, ఎస్‌ శ్రీశాంత్‌, హర్భజన్‌ సింగ్‌, నమన్‌ ఓజా(వికెట్‌ కీపర్‌), అక్షశ్‌ దిండా, ప్రజ్ఞాన్‌ ఓజా, అజయ్‌ జడేజా, ఆర్పీ సింగ్‌, జోగీందర్‌ శర్మ, రితేందర్‌ సింగ్‌ సోధి.

వరల్డ్‌ జెయింట్స్‌ జట్టు:
ఇయాన్‌ మోర్గాన్‌(కెప్టెన్‌), లెండిల్‌ సిమన్స్‌, హర్షల్‌ గిబ్స్‌, జాక్వస్‌ కలిస్‌, సనత్‌ జయసూర్య, మాట్‌ ప్రియర్‌(వికెట్‌ కీపర్‌), నాథన్‌ మెకల్లమ్‌, జాంటీ రోడ్స్‌, ముత్తయ్య మురళీధరన్‌, డేల్‌ స్టెయిన్‌, హోమిల్టన్‌ మసకజ్ద, మష్రాఫ్‌ మోర్తజా, అస్గర్‌ అఫ్గన్‌, మిచెల్‌ జాన్సన్‌, బ్రెట్‌ లీ, కెవిన్‌ ఒ బ్రెయిన్‌, దినేశ్‌ రామ్‌దిన్‌(వికెట్‌ కీపర్‌).