Site icon HashtagU Telugu

Sourav Ganguly : నా పరిధి ఏంటో నాకు తెలుసు

Ganguly

Ganguly

టీమిండియా మాజీ కెప్టెన్ ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ నిబంధనలకు విరుద్ధంగా గంగూలీ సెలక్షన్‌ కమిటీ సమావేశాల్లో పాల్గొంటున్నారనే ఆరోపణలు వచ్చాయి.సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్, అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీ, అప్పటి వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, ఇతర ఆఫీస్ బేరర్లతో కలిసున్న గంగూలీ ఫొటో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో గంగూలీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి సెలక్షన్ సమావేశాల్లో బీసీసీఐ అధ్యక్షుడి పాత్ర ఏమీ ఉండదు. ఆ సమావేశాలకు హాజరు కాకూడదు కూడా. కానీ గంగూలీ వారితో కలిసి ఉన్న ఫొటో వెలుగులోకి రావడంతో క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.తాజాగా, ఈ వివాదంపై స్పందించిన దాదా.. బీసీసీఐ అధ్యక్షుడిగా తన పాత్ర ఏంటో తనకు తెలుసన్నాడు. ఫొటో విషయంలో తాను స్పష్టత ఇవ్వదలిచానని పేర్కొన్న గంగూలీ.. అది సెలక్షన్ కమిటీకి సంబంధించినది కాదని స్పష్టం చేశాడు.
తాను బీసీసీఐకి ప్రెసిడెంట్ అని, ఇలాంటి పిచ్చి వార్తలపై స్పందించాల్సిన అవసరం లేదని అన్నాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా తనకు ఎలాంటి అధికారాలు ఉన్నాయో స్పష్టంగా తెలుసన్నాడు. వాటికీ అనుగుణంగానే తాను ప్రవర్తిస్తున్నాననీ , సెలక్షన్‌ కమిటీ సమావేశాల్లో పాల్గొంటున్నట్లు వస్తున్న వార్తల గురించి పట్టించుకోవాల్సిన అవసరం తనకు లేదనీ స్పష్టం చేశాడు. భారత క్రికెట్ కు ఎన్నో అద్భుత విజయాల్ని అందించానన్న దాదా తనకు నిబంధనలు తెలియవు అనడం ఎంత మాత్రం సరికావని వ్యాఖ్యానించాడు.

Exit mobile version