భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) ఆరు సంవత్సరాల తర్వాత మళ్లీ బెంగాల్ క్రికెట్ సంఘం (CAB) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కోల్‌కతాలో జరిగిన 94వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన ఏకగ్రీవంగా ఎన్నిక కావడం విశేషం. గంగూలీ గతంలో 2015 నుంచి 2019 వరకు ఈ పదవిలో పనిచేసి, అనంతరం బీసీసీఐ అధ్యక్షుడిగా వ్యవహరించారు. తన అన్న స్నేహశీష్ గంగూలీ ఆరు సంవత్సరాల పదవీ పరిమితి పూర్తి చేయడంతో ఈ సారి గంగూలీకి మళ్లీ అవకాశం వచ్చింది.
Petrol Price : డీజిల్, పెట్రోల్ ధరలు రూ.50కి తగ్గించండి – KTR
తన కొత్త పదవీకాలంలో గంగూలీ ప్రధాన లక్ష్యాలను స్పష్టంగా వెల్లడించారు. ఎడెన్ గార్డెన్స్ సామర్థ్యాన్ని మరోసారి లక్ష సీట్లకు పెంచడం, రాబోయే 2026 T20 ప్రపంచకప్‌లో కీలక మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వడం, మరియు టెస్ట్ క్రికెట్‌ను మళ్లీ ఎడెన్ గార్డెన్స్‌కు తీసుకురావడం ప్రధాన ప్రాధాన్యతలుగా పేర్కొన్నారు. నవంబర్ 14న భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగే టెస్ట్ మ్యాచ్ ఈ వేదికలో 2019 తర్వాత జరగబోతున్న ప్రథమ టెస్ట్ కావడం ప్రత్యేకత. ఈ పోరుకు సదుపాయాలు, ప్రేక్షకుల స్పందన అన్నీ ఉన్నాయని గంగూలీ విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇకపోతే బెంగాల్ క్రికెట్ అభివృద్ధిపై కూడా గంగూలీ దృష్టి సారించారు. దుముర్‌జాలలో తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో ఆధునిక సదుపాయాలతో కొత్త అకాడమీని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్ నిర్మాణాన్ని బలోపేతం చేస్తామని, జిల్లాల క్రికెట్ అభివృద్ధి నిధులను రూ.5 కోట్ల నుంచి రూ.8 కోట్లకు పెంచుతున్నామని తెలిపారు. తనతో పాటు బబ్లు కొలాయ్ (సెక్రటరీ), మదన్ మోహన్ ఘోష్ (జాయింట్ సెక్రటరీ), సంజయ్ దాస్ (ఖజాంచి), అనూ దత్త (వైస్ ప్రెసిడెంట్) లతో కూడిన ప్యానెల్ కూడా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం గంగూలీకి మరింత బలం చేకూర్చింది.