Saurav Ganguly: ఛాపెల్‌తో వివాదంపై దాదా ఏమన్నాడంటే!

భారత క్రికెట్‌లో గ్రెగ్ ఛాపెల్ హయాం ఓ చీకటి అధ్యాయం. నిలకడగా ఆడుతున్న జట్టును తన పనికిమాలిన వ్యూహాలతో అధపాతాళానికి పడేసాడు.

  • Written By:
  • Updated On - July 8, 2022 / 06:21 PM IST

భారత క్రికెట్‌లో గ్రెగ్ ఛాపెల్ హయాం ఓ చీకటి అధ్యాయం. నిలకడగా ఆడుతున్న జట్టును తన పనికిమాలిన వ్యూహాలతో అధపాతాళానికి పడేసాడు. ఇక గంగూలీ, గ్రెగ్‌ చాపెల్‌ వివాదం భారత క్రికెట్‌లోనే ఓ మచ్చగా మిగిలిపోయింది. భారత క్రికెట్‌ను కుదిపేసిన వివాదాల్లో ఇదీ ఒకటి. అప్పటి వరకూ టీమిండియాలో తిరుగులేని వ్యక్తిగా ఉన్న గంగూలీ.. చాపెల్‌ ఎంట్రీతో జట్టులో చోటు కోల్పోయిన పరిస్థితి. ఏరి కోరి తెచ్చుకున్న కోచ్‌తోనే నానా ఇబ్బందులు పడిన దాదా ఒకానొక దశలో జట్టుకు కూడా దూరమయ్యాడు. కాగా ఛాపెల్‌ చీకటి ఎపిసోడ్‌పై తాజాగా దాదా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2004లో జాన్‌ రైట్‌ పదవీకాలం ముగిసిన తర్వాత కొత్త కోచ్‌ కోసం చర్చ జరిగిందని, ఆ సమయంలో గ్రెగ్‌ చాపెల్‌ను కలిసినప్పుడు అతడే సరైన వ్యక్తిగా అనిపించాడని గంగూలీ చెప్పాడు. తర్వాతి కాలంలో ఆ వ్యక్త వల్లే తన కెరీర్‌ ఇబ్బందుల్లో పడుతుందని ఊహించలేదన్నాడు. అయితే ఛాపెల్‌ను కోచ్‌గా తీసుకురావడం ద్వారా తప్పు చేశానని తాను అనుకోవడం లేదన్నాడు.

ఓ పని చేసిన తర్వాత వచ్చే ఫలితాలతోనే ఇలాంటి ఆలోచన వస్తుందన్నాడు. ఒకరిని తీసుకోవాలి అనుకున్నప్పుడు ఆ వ్యక్తినే తీసుకుంటామని… ఒకవేళ అది పని చేయకపోతే చేయదన్నాడు. అందుకే దానిని ఓ తప్పుగా తాను భావించడం లేదని గంగూలీ వ్యాఖ్యానించాడు. చాపెల్‌ కారణంగా 13 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్ తర్వాత మళ్లీ దేశవాళీ క్రికెట్‌ ఆడాల్సి రావడంపైనా దాదా స్పందించాడు. కు వెళ్లాల్సిన పరిస్థితిపై కూడా గంగూలీ స్పందించాడు. దీనిని తానో బ్రేక్‌గా పరిగణించినట్లు చెప్పుకొచ్చాడు. దేశవాళీ క్రికెట్‌ ఆడటం కష్టంగా భావించలేదన్న దాదా….ఆ పరిస్థితులు మాత్రం కఠినంగా అనిపించాయన్నాడు. భారత జట్టుకు విరామం లేకుండా 13 ఏళ్లు ఆడానని, ఒక్క సిరీస్‌ లేదా టూర్‌ మిస్‌ కాలేదని గుర్తు చేశాడు. ఇప్పటి ప్లేయర్స్‌ తీసుకుంటున్నట్లు తాను విశ్రాంతి తీసుకోలేదన్నాడు. అందుకే ఆ 4 నుండి 6 నెలల కాలాన్ని ఓ బ్రేక్‌గా భావించానన్నాడు. ప్రస్తుతం లండన్‌లో ఉన్న దాదా తన 50వ బర్త్‌డే వేడుకలను కుటుంబసభ్యులతో పాటు బీసీసీఐ సెక్రటరీ జైషా. మాజీ క్రికెటర్ సచిన్ వంటి సన్నిహితులతో సెలబ్రేట్ చేసుకున్నాడు