Site icon HashtagU Telugu

Gautam Gambhir: పదవి గండంలో గంభీర్, జోగేందర్ జోస్యం

Gautam Gambhir

Gautam Gambhir

Gautam Gambhir: టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ జోగీందర్ శర్మ తాజాగా గౌతమ్ గంభీర్ పై సెన్సేషన్ కామెంట్స్ చేశాడు. 2007 టీ20 ప్రపంచకప్ విజేత జట్టులో జోగిందర్ శర్మ ఉన్నాడు. ఆ టోర్నీలో గౌతమ్ గంభీర్ కీ రోల్ ప్లే చేశాడు. గంభీర్ 54 బంతుల్లో 75 పరుగులతో టీమిండియాను ఛాంపియన్ గా నిలబెట్టాడు. అయితే తాజాగా తన సహచరుడు గంభీర్ ని ఉద్దేశించి జోగీందర్ శర్మ చేసిన కామెంట్స్ సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. గంభీర్ ప్రధాన కోచ్ గా ఎక్కువ కాలం ఉండడని షాకింగ్ కామెంట్స్ చేశాడు శర్మ. తాను ఈ కామెంట్స్ చేయడానికి మూడు కారణాలున్నాయన్నాడు జోగేందర్ శర్మ.

ఫస్ట్ రీసన్ గౌతమ్ గంభీర్ నిర్ణయాలు ఇతరులకు నచ్చని విధంగా ఉంటాయి. రెండో కారణం ఏమిటంటే అతను సూటిగా మాట్లాడే వ్యక్తి, ఎవరి దగ్గరికి వెళ్లడు, ఎవర్ని పొగిడేవాడు కాదు. మూడవ కారణం గంభీర్ ఎప్పుడూ క్రెడిట్ తీసుకోవాలనుకోడు. తన పని చేసుకుంటూ వెళ్లిపోయే మనస్తత్వం గంభీర్ ది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే జోగేందర్ శర్మ చేసిన కామెంట్స్ పై పలువురు స్పందిస్తున్నారు. శర్మ మాటల్లో నిజాయితీ ఉందని, గంభీర్ ముక్కుసూటి మనిషని చెబుతున్నారు. నెటిజన్లు కూడా పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. టీమిండియాకు ఇలాంటి దమ్మున్న కోచ్ దొరకడం అదృష్టమని కామెంట్స్ చేస్తున్నారు.

గంభీర్ తొలి ప్రయత్నమే ఫలించింది.శ్రీలంకతో జరిగిన తొలి టి20 సిరీస్ సక్సెస్ ఫుల్ గా సాగింది. ఫైనల్ మ్యాచ్ లో రింకు సింగ్, సూర్య కుమార్ యాదవ్ లతో బౌలింగ్ వేయించి గంభీర్ సక్సెస్ అయ్యాడు. మొత్తానికి విజయంతో గౌతం గంభీర్ ప్రయాణం మొదలైంది. టీ20 సిరీస్‌లో భారత్ 3-0తో శ్రీలంకను ఓడించింది. కొలంబో వేదికగా జరిగిన వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్ టై కాగా, రెండో మ్యాచ్‌లో భారత్ 32 పరుగుల తేడాతో ఓడిపోయింది.

Also Read: CM Yogi Adityanath: జనతా దర్బార్‌లో దూసుకుపోతున్న సీఎం యోగి