T20 Captain: టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో టి20 కెప్టెన్ పోస్ట్ ఖాళీ అయింది. తదుపరి టీ20 జట్టు కెప్టెన్ ఎవరనే దానిపై జోరుగా చర్చ జరుగుతుంది. అయితే ఇద్దరి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ జాబితాలో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, పవర్ ఫుల్ బ్యాట్స్ మెన్ సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు. నివేదికల ప్రకారం ప్రధాన కోచ్ గంభీర్ మరియు రోహిత్ శర్మ ఇద్దరూ కూడా సూర్యకుమార్ యాదవ్ నే తదుపరి టి20 కెప్టెన్ చేయాలనీ భావిస్తున్నారు.
టీమిండియా త్వరలో టి20సిరీస్ కోసం శ్రీలంక వెళ్లనుంది.అయితే శ్రీలంక పర్యటనతో పాటు 2026 టీ20 ప్రపంచకప్ వరకు సూర్యకుమార్ యాదవ్ టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరించనున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. వాస్తవానికి తొలుత హార్దిక్ పాండ్యా పేరు ఫైనల్ అనుకున్నప్పటికీ పాండ్య ఫిట్‌నెస్ గురించి పలువురు ఆందోళన చెందుతున్నారు. హార్దిక్ మాటిమాటికి గాయాల బారీన పడుతుండటంతో అతనిపై జట్టు బాధ్యత పెట్టడం సరైంది కాదని సెలక్షన్ కమిటీ అభిప్రాయపడుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా టి20 ఫార్మేట్ కు దీర్ఘకాల కెప్టెన్ గా సూర్యనే కరెక్ట్ అని అనుకుంటున్నారు.
సూర్యకుమార్ యాదవ్ గతంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లకు భారత్‌కు నాయకత్వం వహించాడు. దీంతోపాటు దేశవాళీ క్రికెట్, ఐపీఎల్‌కు కూడా కెప్టెన్‌గా వ్యవహరించాడు. సూర్యకుమార్ యాదవ్ ఇప్పటివరకు మొత్తం 7 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. సూర్య కెప్టెన్సీలో టీమ్ ఇండియా 7 మ్యాచ్‌ల్లో 5 గెలిచింది, రెండిట్లో ఓటమిని చవిచూసింది. అలాగే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ముంబైకి కెప్టెన్‌గా వ్యవహరించాడు. రంజీ ట్రోఫీలో 6 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. అందులో ముంబై ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. కాగా 2 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. కాగా 3 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. ఇది కాకుండా దేశీయ టి20 క్రికెట్ అంటే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా సూర్యకుమార్ యాదవ్ ముంబైకి కెప్టెన్‌గా ఉన్నాడు. ముస్తాక్ అలీ ట్రోఫీలో 16 మ్యాచ్‌లకు సూర్య కెప్టెన్‌గా వ్యవహరించాడు. సూర్య కెప్టెన్సీలో ముంబై 16 మ్యాచ్‌లు ఆడగా 10 మ్యాచ్‌లు గెలిచి 6 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.
ఐపీఎల్‌లో కూడా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. రెగ్యులర్ కెప్టెన్ కానప్పటికీ. ఐపీఎల్‌లో కేవలం 1 మ్యాచ్‌లో మాత్రమే ముంబై ఇండియన్స్‌కు సూర్య కెప్టెన్‌గా వ్యవహరించి జట్టును విజయతీరాలకు చేర్చాడు. సూర్యకుమార్ యాదవ్ 2021లో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. అప్పటి నుండి 68 మ్యాచ్‌లలో 43.33 సగటు మరియు 167.74 స్ట్రైక్ రేట్‌తో 2340 పరుగులు చేశాడు.
Also Read: Director Puri : డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఫై పోలీసులకు ఫిర్యాదు