Site icon HashtagU Telugu

Cricket – Cameras : క్రికెట్ మ్యాచ్ కవరేజీకి వాడే కెమెరాలివీ..

Cricket Cameras1

Cricket Cameras1

Cricket – Cameras : ఇప్పుడు అహ్మదాబాద్‌లోని నరేంద్రమోడీ స్టేడియంలో క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. సరికొత్త టెక్నాలజీతో కూడిన అధునాతన కెమెరాల వినియోగం క్రికెట్‌లో గణనీయంగా పెరిగింది. ఈ తరుణంలో క్రికెట్ మ్యాచ్ కవరేజీకి వాడే కెమెరాలతో ముడిపడిన ఆసక్తికర వివరాలను మనం తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join.

మీరు టీవీలో క్రికెట్ మ్యాచ్‌ని చూస్తుంటే.. ప్లేయర్స్‌ను ప్రతీ  యాంగిల్ నుంచి కవర్ చేస్తుండటాన్ని అబ్జర్వ్  చేసి ఉంటారు. అదెలా సాధ్యమైంది ? అంటే.. అన్ని వైపులా, వివిధ యాంగిళ్లలో అమర్చి  ఉన్న కెమెరాల వల్ల సాధ్యమైంది అని చెప్పొచ్చు. రకరకాల కెమెరాలను రకరకాల యాంగిల్స్‌ను మ్యాచ్‌ను, ప్లేయర్స్‌ను, బౌలర్స్, బ్యాట్స్‌మెన్‌లను కవర్ చేయడానికి వాడుతుంటారు.

స్టూడియోకు లైవ్ ఫీడ్‌ను ఇచ్చేందుకు ఒక మెయిన్ కెమెరా ఉంటుంది. ఇక గ్రౌండ్‌లో బంతి వెళ్తుంటే కవర్ చేయడానికి, బౌండరీ లైన్స్ కవర్ చేయడానికి, కీపర్‌ను కవర్ చేయడానికి, స్టంప్స్‌ను కవర్ చేయడానికి ప్రత్యేక కెమెరాలు ఉంటాయి.

  • మ్యాచ్ విజువల్స్‌ను కవర్ చేయడానికి 6 హాక్ ఐ టెక్నాలజీ కెమెరాలు గ్రౌండ్‌లో నలువైపులా అమర్చి ఉంటాయి. గ్రౌండ్‌లోని ప్రతి యాంగిల్ ఒక హాక్ ఐ కెమెరా అమర్చి ఉంటుంది.
  • బ్యాట్స్‌మన్ రన్స్ తీసేటప్పుడు కవర్ చేయడానికి 4 కెమెరాలు ఉంటాయి.
  • బ్యాట్స్‌మన్ బంతిని కొట్టినప్పుడు గ్రౌండ్‌లో బంతులు ఎక్కువగా పడే ఛాన్స్ ఏరియాలను స్ట్రైక్ జోన్‌లు అంటారు. వాటిని క్యాప్చర్ చేయడానికి 2 కెమెరాలు ఉంటాయి.
  • ఇక వికెట్ స్టంప్స్‌ మధ్యలో 2 కెమెరాలు అమర్చి ఉంటాయి. ఇవి బౌలర్, బ్యాట్స్‌మన్, వికెట్ కీపర్‌కు సంబంధించిన ప్రత్యేక సమాచారాన్ని అందిస్తాయి. వాటి సహాయంతోనే మనం స్టంప్ దగ్గరి స్లో మోషన్ రీప్లేలను చూడగలుగుతాం.
  • మీరు బౌండరీ లైన్ దగ్గరలో చూసే కెమెరాలను బౌండరీ కెమెరా అంటారు. ఫీల్డింగ్ యాక్షన్ యొక్క క్లోజ్ అప్ షాట్‌లను వీటి ద్వారా తీస్తారు. ఆటగాళ్ల కదలికల సీన్‌లను ఇవి బంధిస్తాయి.
  • ఇక నిలువుగా, అడ్డంగా.. ఎటువైపే తిప్పే వీలున్న కెమెరాలతోనూ క్రికెట్ మ్యాచ్‌ను షూట్ చేస్తారు. వీటిని స్పైడర్ కెమెరాలు అని పిలుస్తారు. వీటి ద్వారా డైనమిక్ ఏరియల్ షాట్‌ల విజువల్స్‌ను బంధిస్తారు.
  • అల్ట్రా స్లో మోషన్ కెమెరాలతోనూ క్రికెట్ మ్యాచ్ షూటింగ్ జరుగుతుంది. వీటి ద్వారానే స్లో మోషన్‌లో ఫీల్డింగ్ యాక్షన్, బౌలింగ్ యాక్షన్, కీపింగ్ యాక్షన్‌తో ముడిపడిన సీన్లను(Cricket – Cameras) బంధిస్తారు.

Also Read: India vs Australia: టాస్ ఓడిన టీమిండియా.. తొలుత బౌలింగ్ చేయనున్న ఆసీస్..!