Site icon HashtagU Telugu

IPL 2022: శ్రేయాస్ రాకతో కోల్ కథ మారేనా ?

Kkr44

Kkr44

ఐపీఎల్‌ మెగా వేలంలో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించిందనే చెప్పాలి. కేకేఆర్ జట్టు ఈసారి వేలంలో రూ. 85 కోట్ల 50 లక్షలు ఖర్చు చేసింది. కేకేఆర్ కొనుగోలు చేసిన వారిలో మొత్తం 25 మంది ఆటగాళ్లలో 17 మంది భారత్‌కు చెందినవారు ఉండగా.. 8 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. రిటైన్‌ జాబితాలో సునిల్ నరైన్, ఆండ్రూ రస్సెల్, వరుణ్‌ చక్రవర్తి, వెంకటేశ్‌ అయ్యర్‌ లను కేకేఆర్ తమ వద్దే ఉంచుకుంది. మిగతా ఆటగాళ్లను మెగావేలంలో కొనుగోలు చేసింది. వేలంలో శ్రేయస్‌ అయ్యర్‌ను కేకేఆర్ భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ సారి వేలంలో

శ్రేయస్‌ అయ్యర్ కు రూ. 12.25 కోట్లు చెల్లించి సొంతం చేసుకుంది.. అలాగే నితీశ్‌ రాణాకు రూ. 8 కోట్లు, శివమ్‌ మావికి రూ. 7.25 కోట్లు, ప్యాట్‌ కమిన్స్‌ కు రూ. 7.25 కోట్లు చెల్లించి దక్కించుకుంది… అలాగే కేకేఆర్ ఫ్రాంచైజీ ఉమేశ్‌ యాదవ్ కు రూ. 2 కోట్లు, సామ్‌ బిల్లింగ్స్‌ కు రూ. 2 కోట్లు, అలెక్స్‌ హేల్స్‌ కు రూ. 1.50 కోట్లు, టిమ్‌ సౌథీ కి రూ. 1.50 కోట్లు, అజింక్య రహానెకు రూ. కోటి, మహ్మద్ నబీకి రూ. కోటి చెల్లించి వేలంలో కైవసం చేసుకుంది… వీరితోపాటుగా కేకేఆర్ యాజమాన్యం షెల్డన్‌ జాక్‌సన్‌ కు రూ. 60 లక్షలు, రింకు సింగ్ కు రూ. 55 లక్షలు, అశోక్‌ శర్మకు రూ. 55 లక్షలు చమిక కరుణరత్నెకు రూ. 50 లక్షలు, అభిజిత్‌ తోమర్కు రూ.40 లక్షలు, అమన్‌ఖాన్‌, అనుకుల్ రాయ్, ప్రతామ్‌ సింగ్, రసిఖ్ దార్‌, బాబా ఇంద్రజిత్ లకు తలో రూ. 20 లక్షలు వెచ్చించి వేలంలో సొంతం చేసుకుంది. గత సీజన్ లో టైటిల్ కు అడుగు దూరంలో నిలిచిపోయిన కోల్ కతా ఈ సారి శ్రేయాస్ అయ్యర్ కు పగ్గాలు అప్పగించబోతోంది. మరి శ్రేయాస్ రాకతోనైనా ఈ జట్టు కథ మారుతుందో లేదో చూడాలి.

Exit mobile version