Star Cricketers : అపర కుబేరుడు ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్‌లోని జామ్ నగర్‌లో అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో బాలీవుడ్ స్టార్లతో పాటు క్రికెటర్లు కూడా పాల్గొన్నారు.ఈ వేడుకలలో సచిన్ టెండూల్కర్ తన భార్య అంజలి, కుమార్తె సారాతో కలిసి పాల్గొన్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ఆయన భార్య సాక్షి పాల్గొన్నారు. జహీర్ ఖాన్, ఆయన భార్య సాగరిక ఘట్గే.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ఆయన భార్య రితికా సజ్దే.. టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్, ఆయన భార్య కలిసి ఈ మెగా ఈవెంట్‌కు హాజరయ్యారు. వెస్టిండీస్‌కు చెందిన డ్వేన్ బ్రావో, నికోలస్ పూరన్(Star Cricketers) కూడా అక్కడ కనిపించారు.
Star Cricketers : భార్యలతో మెగా క్రికెటర్ల ఫొటోలు.. అట్టహాసంగా అనంత్ ప్రీ వెడ్డింగ్

Star Cricketers