Site icon HashtagU Telugu

IND vs ENG: భార‌త్-ఇంగ్లాండ్ టెస్ట్..ఫ్రీ ఎంట్రీ.. ఫ్రీ ఫుడ్

IND vs ENG

IND vs ENG

IND vs ENG:  జనవరి 25 నుంచి భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కు ముందు విద్యార్థులకు శుభవార్త తెలిపింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. వివరాలలోకి వెళితే

టీమిండియా మరో సమరానికి సిద్ధమైంది. రేపటి నుంచి స్వదేశంలో అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్ ఆడనుంది. సౌతాఫ్రికా టూర్ ను ముగించుకుని స్వదేశాని వచ్చిన టీమిండియా ఆఫ్ఘానిస్తాన్ తో మూడు టి20 ల సిరీస్ కు సిద్ధమైంది. మొహాలి వేదికగా రేపు రాత్రి 7 గంటలకు తొలి టి20 మ్యాచ్ జరగనుంది. ఆఫ్ఘానిస్తాన్ తో జరిగే సిరీస్ అనంతరం రోహిత్ సేన ఇంగ్లాడ్ తో ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఆడనుంది.

టెస్టు ఛాంపియన్ షిప్‌‌లో టాప్2లో స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలంటే టీమిండియాకు ఇంగ్లాండ్‌తో జరిగే టెస్టు సిరీస్ గెలవాల్సి ఉంది. దీనిలో భాగంగా హైదరాబాద్‌ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జనవరి 25న తొలి టెస్ట్ మ్యాచ్‌ ఆరంభమవుతుంది. ఈక్రమంలో తెలంగాణ విద్యార్థులకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బంపరాఫర్‌ ప్రకటించింది. తెలంగాణలోని పాఠశాల విద్యార్థులకు ఫ్రీ ఎంట్రీతో పాటు భోజనం కూడా అందిస్తామని ప్రకటించింది. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లోని 6 నుంచి 12వ తరగతి విద్యార్థులు ఈ మ్యాచ్‌కు రావొచ్చని తెలిపింది.మ్యాచ్‌ను చూడాటానికి వచ్చే విద్యార్థులు తప్పనిసరిగా స్కూల్‌ యూనిఫామ్‌లోనే స్టేడియానికి రావాలని హెచ్‌సీఏ సూచించింది. ఇందుకోసం పాఠశాలల ప్రిన్సిపాల్స్ తమ స్కూల్ నుంచి ఎంతమంది విద్యార్థులు, సిబ్బంది వస్తున్నారో ముందుగా తెలియజేయాలి.

జనవరి 18వ తేదీలోపు హెచ్‌సీఏ సీఈవోకు ceo.hydca@gmail.com కు మెయిల్‌ చేయాల్సి ఉంటుంది. హెచ్ సీఏ కల్పించిన ఈ సౌకర్యానికి విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన క్రికెటర్లను నేరుగా చూసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నారు

Also Read: Best 5G Smartphones: తక్కువ ధరలో 5జీ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. అయితే ఒకసారి ఈ లిస్టు చూడాల్సిందే?

Exit mobile version