Flintoff: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ (Flintoff) త్వరలో 9 మిలియన్ పౌండ్ల (రూ. 91 కోట్లు) పరిహారం పొందనున్నాడు. ఈ పరిహారం అతనికి BBC ద్వారా అందనుంది. నిజానికి ఫ్లింటాఫ్‌కి BBC షో ‘టాప్ గేర్’ షూటింగ్‌లో ఉండగా కారు ప్రమాదం జరిగింది. ఈ దారుణ ఘటన గతేడాది డిసెంబర్‌లో జరిగింది. అనేక నెలల చర్చల తర్వాత ఫ్లింటాఫ్, BBC ఒక ఒప్పందానికి వచ్చాయి. ఫ్లింటాఫ్ పరిహారం ఈ ఒప్పందం ప్రకారం మాత్రమే నిర్ణయించారు.
డిసెంబర్ 2023లో BBC ప్రసిద్ధ ఆటో షో ‘టాప్ గేర్’ షూటింగ్ సమయంలో ఆండ్రూ ఫ్లింటాఫ్ తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నాడు. సౌత్ లండన్‌లోని డన్‌ఫోల్డ్ పార్క్ ఏరోడ్రోమ్‌లో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే అతడిని విమానంలో ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం తర్వాత చాలా రోజులు కెమెరా ముందుకు రాలేకపోయాడు ఫ్లింటాఫ్. అతను ఇటీవల తొమ్మిది నెలల తర్వాత బహిరంగంగా కనిపించాడు. అతని ముఖంపై ఇంకా చాలా గాయాల గుర్తులు ఉన్నాయి.
ఈ ఒప్పందాన్ని వివరిస్తూ BBC స్టూడియోస్ ప్రతినిధి మాట్లాడుతూ.. BBC స్టూడియోస్ ఆండ్రూ ఫ్లింటాఫ్ (ఫ్రెడ్డీ)తో ఒప్పందం కుదుర్చుకుంది. మేము అతని పునరావాస కార్యక్రమానికి, తిరిగి పనికి, భవిష్యత్తు ప్రణాళికలకు మద్దతునిస్తూనే ఉంటాము. మేము ఫ్రెడ్డీకి హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాము. అతను కోలుకోవడానికి మా పూర్తి సహాయాన్ని అందిస్తూనే ఉంటామని చెప్పుకొచ్చాడు.
Also Read: Dil Raju: దిల్ రాజు అల్లుడి ఖరీదైన కారు చోరీ, కేటీఆర్ పేరు చెప్పి మరీ..!
We’re now on WhatsApp. Click to Join.
ఫ్లింటాఫ్ ఇంగ్లండ్‌కు బలమైన ఆల్‌రౌండర్
ఆండ్రూ ఫ్లింటాఫ్ ఒకప్పుడు ఇంగ్లండ్ అతిపెద్ద మ్యాచ్ విన్నర్. తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇంగ్లండ్‌ను అనేక సందర్భాల్లో విజయతీరాలకు చేర్చాడు. ఈ శక్తివంతమైన ఆల్‌రౌండర్ టెస్ట్ క్రికెట్‌లో అతని పేరు మీద 3845 పరుగులు, 226 వికెట్లు ఉన్నాయి. ఫ్లింటాఫ్ వన్డే క్రికెట్‌లో 3394 పరుగులు, 169 వికెట్లు కూడా తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అతని పేరిట మొత్తం 8 సెంచరీలు ఉన్నాయి. ఫ్లింటాఫ్ 1998లో ఇంగ్లండ్ తరఫున ఆడటం ప్రారంభించాడు. అతను 2009 వరకు ఇంగ్లండ్ జట్టులో భాగంగా ఉన్నాడు. అయితే, గాయం కారణంగా అతను జట్టులోకి వస్తూ పోతూ ఉండేవాడు. 2005లో ఆడిన యాషెస్ సిరీస్‌ను ఫ్లింటాఫ్ బలమైన ప్రదర్శన ఆధారంగానే ఇంగ్లండ్ గెలుచుకుంది.