Site icon HashtagU Telugu

Foreign players in IPL: విదేశీ ఆటగాళ్లపై ఫోకస్ చేస్తున్న ఆ ఫ్రాంచైజీలు

IPL 2025

IPL 2025

Foreign players in IPL: మెగా వేలానికి ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి. ఐపీఎల్ నిబంధనల ప్రకారం మెగా వేలానికి ముందు జట్లు కేవలం నలుగుర్ని మాత్రమే ఉంచుకునే అవకాశం ఉంది. ఈసారి రిటైన్ ఆటగాళ్ల సంఖ్యను పెంచే అవకాశం ఉంది. అయితే రిటైన్ ఆటగాళ్ల సంఖ్య 6కు మించి ఉండకూడదు. ఈ నేపథ్యంలో మెగవేలంలో భారీ మార్పులు చోటు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. IPL 2025

2024 ఐపీఎల్ లో కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) తరఫున ఫిల్ సాల్ట్ అద్భుతంగ రాణించాడు. అయినప్పటికీ వచ్చే సీజన్లో ఫీల్ సాల్ట్ ని కేకేఆర్ రిలీజ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఫీల్ సాల్ట్ మెగవేలంలోకి రావొచ్చు. ఇదే జరిగితే అతనిపై కోట్ల విలువైన బిడ్లు దాఖలయ్యే అవకాశం ఉంది. గతేడాది ఐపీఎల్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ట్రావిస్ హెడ్ ప్రతి మ్యాచ్ లోనూ చెలరేగి ఆడాడు. అయితే హెడ్ కి ఇష్టం లేకపోయినా వచ్చే సీజన్లో ఎస్ఆర్హెచ్ హెడ్ ని విడుదల చేసే అవకాశం ఉంది. ఎందుకంటే సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH)ఒక విదేశీ ఆటగాడిని మాత్రమే ఉంచుకోవాల్సి ఉంది. ఢిల్లీకి సారధ్యం వహిస్తున్న జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ ను ఢిల్లీ విడుదల చేయనుంది. జేక్ 9 మ్యాచ్‌ల్లో 36.67 సగటుతో 330 పరుగులు చేశాడు. ఈ సమయంలో నాలుగు అర్ధ సెంచరీలు చేశాడు. 234 అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో జేక్ ఎన్నో అద్భుత ఇన్నింగ్స్ లు ఆడాడు. ఒకవేళ ఫ్రేజర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేయకపోతే వేలంలో అతనికి భారీ మొత్తం లభించే అవకాశం ఉంది.

గతేడాది జరిగిన మినీ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్క్‌ను 24.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పుడు కేకేఆర్ అతనిని నిలుపుకునే అవకాశం లేదు. దీంతో స్టార్క్‌ వేలంలోకి రావడం ఖాయం. ఇదే జరిగితే స్టార్క్‌ కోసం ఆయా జట్లు భారీ మొత్తంలో వెచ్చించే అవకాశం ఉంది. గతేడాది గ్లెన్ ఫిలిప్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ కి ప్రాతినిధ్యం వహించాడు. అయితే ఈ స్టార్ ఆటగాడికి ఆడే అవకాశం రాలేదు. టీ20 క్రికెట్‌లో గ్లెన్ ఫిలిప్స్ చాలా ప్రమాదకరంగా బ్యాటింగ్ చేశాడు. టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేసే గ్లెన్ ఫిలిప్స్ ని దక్కించుకునేందుకు ఆర్సీబీ సిద్ధమైంది. ఒకవేళ గ్లెన్ ఫిలిప్స్ ఆర్సీబీలోకి వస్తే ఆర్సీబీ పేట్ మారుతుందనడంలో సందేశం లేదు.

Also Read: Harish Rao Slams Revanth Govt: సైంటిస్టులకు జీతాలు ఎప్పుడు చెల్లిస్తావ్ రేవంత్: హరీష్ రావు