Simona Halep suspended: టెన్నిస్ స్టార్ ప్లేయర్ సిమోనా హలెప్ పై నిషేధం..!

టెన్నిస్ స్టార్, మాజీ వరల్డ్ నెంబర్ వన్ ప్లేయర్ సిమోనా హలెప్ డోపింగ్ టెస్టులో పట్టుబడింది.

  • Written By:
  • Publish Date - October 21, 2022 / 11:12 PM IST

టెన్నిస్ స్టార్, మాజీ వరల్డ్ నెంబర్ వన్ ప్లేయర్ సిమోనా హలెప్ డోపింగ్ టెస్టులో పట్టుబడింది. దీంతో అంతర్జాతీయ టెన్నిస్ ఇంటెగ్రిటీ ఏజెన్సీ (ITIA) ఆమెపై తాత్కాలిక నిషేధం విధించింది. ఆగస్టులో US ఓపెన్ లో పాల్గొన్న హలెప్ డోపింగ్ టెస్టులో భాగంగా శాంపిల్ ఇచ్చింది. ఆ టెస్టులో రోక్సాడుస్టాట్ అనే నిషేధిత డ్రగ్ తీసుకున్నట్లు తేలింది. ఆమె ఖాతాలో 2 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ తో పాటు 24 WTA టూర్ టైటిల్స్ ఉన్నాయి.

ప్రపంచంలో తొమ్మిదో ర్యాంక్‌లో ఉన్న హలెప్ US ఓపెన్ సమయంలో హలెప్ శాంపిల్స్ పరీక్షించారు. ఆ షాంపిల్స్ డ్రగ్ ఉనికిని నిర్ధారించాయి. 31 ఏళ్ల రోమేనియన్ టెన్నిస్ క్రీడాకారిణి సిమోనా హలెప్ 2022 టెన్నిస్ యాంటీ డోపింగ్ ప్రోగ్రామ్ (TADP) ఆర్టికల్ 7.12.1 ప్రకారం తాత్కాలికంగా సస్పెండ్ చేయబడింది అని బాడీ ఒక ప్రకటనలో తెలిపింది. శాంపిల్స్ A, B నమూనాలుగా విభజించారు. తదుపరి విశ్లేషణలో A నమూనాలో FG-4592 (రోక్సాడుస్టాట్) ఉన్నట్లు కనుగొనబడింది. 2022 ప్రపంచ డోపింగ్ నిరోధక ఏజెన్సీ (WADA) నిషేధిత జాబితాలో జాబితా చేయబడిన నిషేధిత పదార్థం ఇది.

హలెప్ ఈ నిషేధాన్ని తన జీవితంలో అతిపెద్ద షాక్ గా అభివర్ణించింది. నా కెరీర్ మొత్తంలో మోసం చేయాలనే ఆలోచన ఒక్కసారి కూడా నా మదిలో రాలేదు. ఎందుకంటే నేను చదువుకున్న విలువలకు ఇది పూర్తిగా విరుద్ధం అని ఆమె ట్విట్టర్‌లో రాసింది.