IPL 2024 Winner Prediction: వెస్టిండీస్ మాజీ లెజెండ్ బ్రియాన్ లారా ఐపీఎల్ 2024 విజేత ఎవరన్నది అంచనా వేశాడు.ఈ సీజన్లో ప్లేఆఫ్స్‌కు చేరుకున్న మొదటి జట్టుగా కేకేఆర్ జట్టు అవతరించింన విషయం తెలిసిందే. .అయితే ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ , రాజస్థాన్ మరియు హైదరాబాద్ జట్లు ప్లేఆఫ్స్‌లో తమ స్థానానికి చేరువలో ఉన్నాయి. బ్రియాన్ లారా స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ ఈసారి ఐపిఎల్ టైటిల్‌ను గెలుచుకోగల తనకు నచ్చిన జట్టును ప్రకటించాడు. చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్ టైటిల్ గెలుస్తుందని లారా అంచనా వేశాడు. ఐపీఎల్ 17 సీజన్లలో చెన్నై ఇప్పటివరకు మొత్తం 5 సార్లు ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది.
ఈ సీజన్‌లో కేకేఆర్ ఆట తీరుపై లారా మాట్లాడుతూ.. టైటిల్ రేసులో కేకేఆర్ కూడా ఉందని అభిప్రాయపడ్డారు. అయితే చెన్నై ప్లేఆఫ్‌లకు చేరుకోవడంలో విజయవంతమైతే ఈ సీజన్‌లో టైటిల్ గెలుస్తుందని నేను పూర్తిగా ఆశిస్తున్నానని చెప్పాడు. అదే సమయంలో ఆస్ట్రేలియా మాజీ లెజెండ్ మాథ్యూ హేడెన్ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు టైటిల్ గెలవగలదని హేడెన్ పేర్కొన్నాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలోరాజస్థాన్ రెండో స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ టైటిల్ గెలుచుకునే అవకాశం ఉందని హేడెన్ అంచనా వేశారు.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ జట్టు రెండవ స్థానంలో ఉండగా,కేకేఆర్ నంబర్ వన్ స్థానంలోఉంది. దీంతో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 4వ స్థానంలో నిలవగా.. చెన్నై తాజా మ్యాచ్ విజయంతో మూడో స్థానంలో నిలిచింది.
Also Read: Vistadome Coach: ప్రయాణికులకు భిన్నమైన అనుభూతి.. విస్టాడోమ్ కోచ్‌ల గురించి తెలుసా..?