Site icon HashtagU Telugu

Azharuddin:కోహ్లీలో మునుపటి ఆత్మవిశ్వాసం చూడొచ్చు-అజారుద్దీన్..!!

Azharuddin

Azharuddin

టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ ఫామ్ లోకి వచ్చేందుకు సతమతమవుతున్నాడు. 2019నుంచి ఏ ఫార్మాట్ లోనూ కోహ్లీ సెంచరీ సాధించింది లేదు. వీటన్నింటికి తోడు టీమిండియా పరాజయాలు కోహ్లీని నాయకత్వం కోల్పోయేలా చేశాయి. ఈ మధ్యే ఐపీఎల్ లోనూ కోహ్లీ అంతంతమాత్రంగానే రాణించారు. దీంతో విమర్శకులు తమ అస్త్రాలకు మరింత పదునుపెట్టేశారు.

అయితే ఫాంలో లేక ఇబ్బందులు పడుతున్న కోహ్లీకి మాజీ సారథి మహ్మద్ అజారుద్దీన్ నుంచి సపోర్టు లభించింది. కోహ్లీ అద్బుతరీతిలో పుంజుకోవడం ఖాయమన్నారు అజర్. కేవలం ఒక భారీ ఇన్నింగ్స్ తో  పరిస్థితి పూర్తిగా మారిపోతుందన్నారు. కోహ్లీ గతంలో ఆడిన అద్భుత ఇన్నింగ్స్ లో తనకు తానే ఉన్నత ప్రమాణాలను నిర్దేశించుకున్నాడని అందుకే  ఇప్పుడతను  50 పరుగులుచేసినా  ప్రజలకు అదేమంత పెద్ద స్కోరుగా కనిపించడంలేదని అజర్ విశ్లేషించారు. అర్థసెంచరీ సాంధించినా కోహ్లీ విఫలమయ్యాడనే అంటున్నారని  వివరించాడు.

అత్యత్తమ ఆటగాళ్లు ఇలాంటి ప్రతికూల వాతావరణాన్నిఎదుర్కొవడం సహజం అని అభిప్రాయపడ్డారు. కోహ్లీటెక్నిక్ లో  ఎలాంటి లోపాలు కనిపించడంలేదని…కొన్నిసార్లు  అదృష్టం కూడా కలిసిరావాలని అజర్ పేర్కొన్నాడు. ఓ భారీసెంచరీ సాధిస్తే చాలు…కోహ్లీలో మునుపటి ఆత్మవిశ్వాసం చూడవచ్చని వివరించారు.