Site icon HashtagU Telugu

Chris Gayle & Vijay Mallya : యూనివర్స్ బాస్ తో లిక్కర్ కింగ్

Gayle Mallya

Gayle Mallya

ఒకరు లికర్‌ కింగ్‌.. మరొకరు యూనివర్స్‌ బాస్‌.. ఈ లికర్‌ కింగ్‌ ఒకప్పుడు ఈ యూనివర్స్‌ బాస్‌ను తన టీమ్‌లోకి తీసుకున్నాడు. అతడు వచ్చిన తర్వాతే రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు రాత మారింది. ఇన్నాళ్ల తర్వాత ఈ ఇద్దరూ ఒక్క చోట చేరడంపై ఇంటర్నెట్‌లో పెద్ద చర్చే నడుస్తోంది. ఆ ఇద్దరూ ఎవరో కాదు…విజయ్ మాల్యా, క్రిస్ గేల్. ప్రస్తుతం వీరిద్దరూ కలిసిన ఫొటో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. గేల్‌ను కలిసిన సందర్భంగా మాల్యా ఇవే జ్ఞాపకాలను పంచుకున్నాడు. తన ట్విటర్‌లో గేల్‌తో కలిసి ఫొటోను షేర్‌ చేస్తూ మంచి స్నేహితుడు, యూనివర్స్‌ బాస్‌ క్రిస్టొఫర్‌ హెన్రీ గేల్‌తో కలవడం చాలా ఆనందంగా ఉంది. అతన్ని నేను ఆర్సీబీలోకి తీసుకున్నప్పటి నుంచే ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఇప్పటికీ ఇదే అత్యుత్తమ ప్లేయర్‌ ఎంపిక అంటూ మాల్యా ట్వీట్ చేశాడు. ఈ ఫొటో చూసినప్పటి నుంచీ సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ ఓ రేంజ్‌లో రీట్వీట్లు, కామెంట్స్‌, లైక్స్‌, షేర్స్‌ చేస్తున్నారు.నిజానికి క్రిస్‌ గేల్‌ రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌లోకి వచ్చిన తర్వాతే ఐపీఎల్‌లో పరుగుల సునామీ అంటే ఏంటో ప్రపంచానికి తెలిసొచ్చింది. తనను తాను యూనివర్స్‌ బాస్‌గా చెప్పుకున్న గేల్‌.. ఆర్సీబీ తరఫున ఎన్నో మరుపురాని ఇన్నింగ్స్‌ ఆడాడు. అందులో 30 బాల్స్‌లోనే సెంచరీ చేసిన ఇన్నింగ్స్‌ కూడా ఉంది. 2011లో ఆర్సీబీలో చేరిన 2017 వరకూ 91 మ్యాచ్‌లలో 3420 రన్స్‌ చేశాడు. కాగా గేల్ ఈ సారి ఐపీఎల్ వేలం నుంచి తప్పుకున్నాడు. మళ్లీ వచ్చే యేడాది తాను రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని గేల్ ఇటీవలే చెప్పాడు.

Exit mobile version