Shahid Afridi Dead: పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ మరణించారనే (Shahid Afridi Dead) వార్త సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో క్రికెట్ ప్రపంచాన్ని కలవరపరిచింది. ఈ వీడియోలో మాజీ పాకిస్థాన్ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ మరణించారని, ఆయనను కరాచీలో ఖననం చేశారని, అలాగే విజన్ గ్రూప్ చైర్మన్ సహా అనేక మంది అధికారులు సంతాపం వ్యక్తం చేశారని వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తలపై దర్యాప్తు చేసిన తర్వాత.. ఈ వైరల్ వీడియో AI ద్వారా సృష్టించబడినదని, ఇందులో ఎటువంటి నిజం లేదని తేలింది. అఫ్రిదీ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్లు, ఆయన మరణం గురించిన వార్తలు అబద్ధమని నిర్ధారించబడింది. అయితే అఫ్రిదీ ఇటీవల భారత్‌పై చేసిన వ్యాఖ్యలు సైతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వ్యాఖ్యల తర్వాతే అఫ్రిదీ చనిపోయినట్లు వార్తలు పుట్టుకొచ్చాయి.
ఆపరేషన్ సిందూర్ కింద భారత ప్రభుత్వం షాహిద్ అఫ్రిదీ, షోయబ్ అక్తర్ సహా అనేక పాకిస్థానీ క్రికెటర్లు.. పలువురు ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలపై నిషేధం విధించింది. అఫ్రిదీ చాలా సంవత్సరాల క్రితం క్రికెట్ నుండి రిటైర్ అయ్యారు. చాలా కాలంగా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు.
Also Read: BJP National President: బీజేపీ జాతీయ కొత్త అధ్యక్షులు ఎవరు? రేసులో ముగ్గురు దిగ్గజాలు!
షాహిద్ అఫ్రిదీ క్రికెట్ కెరీర్‌ను గమనిస్తే.. ఆయన 2017లో క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆయన తన అంతర్జాతీయ కెరీర్‌లో పాకిస్థాన్ తరపున 11,000 కంటే ఎక్కువ పరుగులు చేశారు. మూడు ఫార్మాట్లలో మొత్తం 541 వికెట్లు తీశారు. వన్డే క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు ఇప్పటికీ ఆయన పేరిట ఉంది. ఆయన తన ODI కెరీర్‌లో 351 సిక్సర్లు కొట్టారు. భారత స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ ఈ విషయంలో ఆయనకంటే కేవలం 7 సిక్సర్లు వెనుకబడి ఉన్నాడు.