Site icon HashtagU Telugu

Factions in Mumbai Indians: ముంబై జట్టులో లుకలుకలు ?

Mumbai Indians

Mumbai Indians

ఐపీఎల్ లో ఐదు సార్లు టైటిల్ విజేత ముంబై ఇండియన్స్‌ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ప్రస్తుత సీజన్‌లో రోహిత్ సేన ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో ఓటమిపాలై పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఈ క్ర‌మంలో ముంబై ఇండియ‌న్స్‌పై ఆ జ‌ట్టు మాజీ ఓపెనర్ క్రిస్ లిన్ సంచ‌ల‌న వాఖ్య‌లు చేశాడు. ముంబై ఇండియన్స్ జ‌ట్టులో విభేదాలున్నాయాని, ఆ జట్టు రెండు గ్రూపులుగా విడిపోయిందని అందుకే ఈ సీజన్ లో దారుణ పరాజయాలను ఎదుర్కొంటుందని క్రిస్ లిన్ వ్యాఖ్యానించాడు.

ముంబై ఇండియన్స్ జట్టులో తనకు రెండు క్యాంపులు కనిపిస్తున్నాయనీ, ఒకటి రోహిత్ శర్మకి అనుకూలం.. మరొకటి రోహిత్ శర్మకి వ్యతిరేకమని అన్నాడు. తనతో పాటు చాలా మందికి ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోందని అనుకుంటున్నట్టు చెప్పాడు. రెండు గ్రూపులుగా విడిపోయినందుకే వరుసగా ఓటమి పాలవుతోందనీ చెప్పుకొచ్చాడు.ముంబై ఇండియన్స్ బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో చాలా స‌మ‌స్య‌లు ఉన్నాయన్న లిన్ విబేధాలను వదిలి కలిసి కట్టుగా ఆడాలని సూచించాడు.

కాగా వరుసగా ఏడు పరాజయాలతో ఐపీఎల్ 15వ సీజన్ ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి ముంబై ఇండియన్స్ దాదాపుగా నిష్క్రమించింది. మిగిలినవి ఏడు మ్యాచ్‌ల్లో అన్ని మ్యాచ్‌లు గెలిచినా ముంబై ఇండియన్స్ కి కేవలం 14 పాయింట్లే లభిస్తాయి. అదే సమయంలో మిగతా తొమ్మిది జట్ల ప్రదర్శన కూడా కూడా ప్రభావం చూపుతోంది.. ఈ క్రమంలో ముంబై జట్టు ఈసారి ప్లే ఆఫ్ కు చేరడం కష్టమే. ముంబై ఇండియన్స్ తమ తదుపరి మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌ తో తలపడునుంది.