Ravi Shastri IPL: కర్మ…అనుభవించండి..తప్పదు..ఢిల్లీ క్యాపిటల్స్ పై రవిశాస్త్రి గుస్సా..!!

ఢిల్లీ క్యాపిటల్స్ టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

  • Written By:
  • Publish Date - May 22, 2022 / 12:23 PM IST

ఢిల్లీ క్యాపిటల్స్ టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఐఫీఎల్ 15లో భాగంగా శనివారం రాత్రి ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓడి పోవడంతో ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకున్న తర్వాత ఈ కామెంట్స్ చేశారు. కీలక సమయంలో DRSతీసుకోకుండా అలసత్వం వహించినందుకు గానూ వాళ్లది వాళ్లు నిందించుకోవాలనన్నాడు. ఇలా జరగడం వాళ్ల కర్మ అన్నారు. శనివారం నాటి మ్యాచులో ముంబై బ్యాట్ర బ్రెవిస్ ను ఔట్ చేసిన వెంటనే టీం డేవిడ్ కూడా ఔటవ్వాల్సింది. కానీ రిషబ్ పంత్ చేసిన తప్పుకు ఆ జట్టు భారీ మూల్యాన్నే చెల్లించుకుంది.

ఢిల్లీ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్య ఛేదనలో అప్పటిదాకా నిదానంగా ఆడిన ముంబై లాస్ట్ లో జోరుపెంచేందుకు ప్రయత్నించింది. డెవాల్డ్ బ్రెవిస్ ను ఔట్ చేశాక టిమ్ డేవిడ్ క్రీజులోకి వచ్చాడు. శార్థూల్ ఠాకూర్ వేసిన 15వ ఓవర్లో నాలుగో బాల్ అతడి బ్యాట్ ను తాగుతూ రిషబ్ చేతులోకి వెళ్లింది. దీంతో శార్దూల్, రిషబ్ ఔట్ కోసం అప్పీల్ చేసినా ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇవ్వలేదు. పంత్ ను చూస్తే రివ్యూ తీసుకుంటాడు అనుకున్నారు. కానీ అతడు శార్దుల్ తో చర్చించి డీఆరెస్ తీసుకోలేదు. సర్ఫరాజ్ ఖాన్ పంత్ తో వాదించాడు. డీఆరెస్ తీసుకోమని కోరాడు. కానీ పంత్ ఆ పని చేయలేదు. ఫలితంగా 11 బంతులు ఆడిన టిమ్ డేవిడ్ 2 ఫోర్లు, 4 సిక్సర్లతో చెలరేగిపోయాడు. ఢిల్లీకి షాకిచ్చి పెవిలియన్ చేరాడు. ఇరు జట్లకు విజయావకాశాలున్నా…ఢిల్లీకే ఎక్కువ ఆధిక్యం ఉండేంది.

దీనంతటిపై రవిశాస్త్రి స్పందించారు. అక్కడున్నవాళ్ల కామన్ సెన్స్ ఏమైంది. సరే..రిషభ్ పంత్ శార్దూల్ చర్చించారు. అక్కడే ఉన్న మిగతా ఫిల్డర్లు ఏం చేస్తున్నారు. ఇంకా ఐదు ఓవర్లు ఉన్నాయి. రెండు రివ్యూలు ఉన్నాయి. డేవిడ్ అప్పుడే వచ్చాడు. వరసగా వికెట్లు పడితే పరిస్థితి మరో రకంగా ఉండేది కదా..ముంబై మీద ఒత్తిడి పెరిగేది..మీరు ఆధిక్యలోకి వచ్చేవారు. వాళ్ల కర్మ తప్పా ఏమీ లేదు. ఫ్లే ఆఫ్స్ చేరాలంటే నెగ్గాల్సిన కీలక మ్యాచ్. ఇఫ్పుడు వాళ్లు నిద్రలేని రాత్రులు గడపాల్సి ఉంటుందన్నారు.