Site icon HashtagU Telugu

Unmukt Chand: జస్ట్ మిస్…కొంచెం ఉంటే కన్ను పోయేది!

Unmukt Chand

Unmukt Chand

Unmukt Chand: భారత మాజీ క్రికెటర్ ఉన్ముక్త్ చంద్ తృటిలో కంటి చూపు పోయే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అమెరికాలో క్రికెట్ టోర్నీ ఆడుతుండగా గాయపడ్డాడు. ఈ విషయాన్ని ఉన్మక్త్‌ చంద్‌ స్వయంగా తన ట్విటర్‌లో షేర్‌ చేసుకున్నాడు. ఉన్ముక్త్‌ చంద్‌ షేర్‌ చేసిన ఫోటోలో అతని ఎడమ కన్ను పూర్తిగా ఉబ్బిపోయి కనిపించకుండా పోయింది. కంటి గాయంపై ఉన్మక్త్‌ చంద్‌ స్పందిస్తూ ఇలాంటి గాయాలు అథ్లెట్స్‌కు అంత మంచివి కావు. కొన్నిసార్లు విజయం మనవైపు ఉంటే.. మరికొన్నిసార్లు నిరాశ వెతుక్కుంటూ వస్తుంది. దేవుడి దయ వల్ల చూపు పోలేదు.. కాకపోతే కొంతకాలం రెస్ట్‌ అవసరం. మళ్లీ బరిలోకి దిగుతా. థాంక్యూ ఫర్‌ గుడ్‌ విషెస్‌’ అంటూ ట్వీట్‌ చేశాడు.

ఉన్ముక్త్‌ చంద్‌ 2012లో అండర్‌ 19 ప్రపంచకప్‌లో భారత యువ జట్టును విజేతగా నిలిపాడు. ఈ సక్సెస్‌తో టీమిండియా భవిష్యత్తు ఆశాకిరణం అవుతాడనుకున్న ఉన్ముక్త్‌ చంద్‌.. చాలాకాలం పాటు ఎదురుచూసినా టీమిండియాకు ఆడలేకపోయాడు. దీంతో గతేడాది భారత్‌ను వీడి యుఎస్‌ఏకు వెళ్ళిపోయాడు. ఉన్ముక్త్‌ ప్రస్తుతం కోరే ఆండర్సన్, లియామ్‌ ప్లంకెట్‌, జుయాన్‌ థెరాన్‌, సమీ అస్లాం వంటి వాళ్ళతో కలిసి యూఎస్‌ఏ క్రికెట్‌ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. గత యేడాది అమెరికన్‌ మైనర్ లీగ్‌లో పరుగుల వరద పారించాడు. ఆ సీజన్‌లో సిలికాన్‌ వ్యాలీ స్ట్రైయికర్స్‌ తరఫున ప్రాతినిధ్యం వహించిన అతను.. 16 ఇన్నింగ్స్‌ల్లో 612 పరుగులు సాధించి సీజన్‌ టాప్ స్కోరర్‌గా నిలిచాడు.